ఢిల్లీలో బిజీ బిజీగా జగన్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఢిల్లీలో బిజీ బిజీగా జగన్

న్యూఢిల్లీ, ఆగస్టు 7  (way2newstv.com)
ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం జగన్ బిజీ బిజీగా ఉన్నారు. రెండ్రోజుల ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం జగన్ బుధవారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడిని కలిశారు. రాజ్యసభ అధ్యక్షుడి హోదాలో ఉన్న వెంకయ్యను మర్యాదపూర్వకంగా కలిసిన జగన్.. ఆయనకు శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సమస్యలకు సంబంధించి పలు అంశాలను ఆయన చర్చించారు. 
 ఢిల్లీలో బిజీ బిజీగా జగన్ 

జగన్‌తోపాటు వైఎస్ఆర్సీపీ ఎంపీలు విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి తదితరులు కూడా ఉపరాష్ట్రపతిని కలిశారు. ఈ విషయాన్ని ఆంధప్రదేశ్ సీఎం కార్యాలయం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న జగన్ కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతోనూ భేటీ అయ్యారు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పలు జాతీయ రహదారి ప్రాజెక్ట్‌లుపై వీరిద్దరూ గంటకుపైగా చర్చించారని వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. అనంతరం ఆయన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కూడా కలిసే అవకాశం ఉంది.