తెలుగువారికి గౌరవం దక్కించిన మహనీయుడు పింగళి:చంద్రబాబు

గుంటూరు ఆగష్టు 2  (way2newstv.com):
భారతదేశానికి జాతీయపతాకాన్ని అందించిన మహనీయుడు పింగళి వెంకయ్యఅని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు కొనియాడారు. ఆయన ద్వారా తెలుగువారికి గొప్ప గౌరవం దక్కిందాని తన ట్విటర్‌లో తెలిపారు. వందేమాతరం, హోమ్‌రూల్ వంటి ఉద్యమాల్లో పింగళి పోరాట స్ఫూర్తి మనందరికీ ఆదర్శనీయమన్నారు. 
తెలుగువారికి గౌరవం దక్కించిన మహనీయుడు పింగళి:చంద్రబాబు  

జాతీయపతాక రూపకర్త, స్వాతంత్య్ర పోరాట యోధుడైన పింగళి వెంకయ్య.. వ్యవసాయ, భూగర్భ శాస్త్ర పరిశోధనలలో సైతం ఎంతో కృషిచేశారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తెలిపారు. స్వాతంత్య్రం వచ్చాక ఖనిజ పరిశోధకశాఖ సలహాదారుగా దేశానికి సేవలందించారన్నారు. ఆ మహనీయుని దేశసేవను స్మరించుకుందామని ఆయన ట్విటర్‌లో పోస్టు చేశారు

Previous Post Next Post