తెదేపాది రాజకీయ ఆక్రోశం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

తెదేపాది రాజకీయ ఆక్రోశం

విశాఖపట్నం ఆగష్టు 20 (way2newstv.com):
టిడిపి నేతలది రాజకీయఆక్రోశం.  సంక్షోభంను అవకాశంగా మలుచుకోవాలనేది చంద్రబాబు విధానం. సంక్షోభం ద్వారా వచ్చిన అవకాశాలను దోపిడీకి వినియోగించుకునేది చంద్రబాబు విధానమని రాష్ట్ర మున్సిపల్ శాఖమంత్రి  బొత్స సత్యన్నారాయణ మండిపడ్డారు. మంగళవారం అయన మీడియాతో మాట్లాడారు. మాకు అలాంటి విధానాలు అక్కర్లేదు. వరదలు వచ్చినా ఆస్ది,ప్రాణనష్టంలేకుండా చర్యలు తీసుకున్నాం. పునరావాసకేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేసి ఆదుకున్నాం. నష్టపరిహారం అందించేందుకు సిధ్దమవుతున్నాం. వరదబాధితులనుంచి ఎలాంటి ఫిర్యాదులు లేవు. వరద తగ్గింది. పంటనష్టంను అంచనా వేస్తున్నాం. కృష్ణాకర కట్టను అధికారులు,మంత్రులు రాత్రిపగలు ముంపుగ్రామాలను పర్యవేక్షించారు.ఎక్కడ బ్రీచ్ లు పడతాయో తెలుసుకుని జాగ్రత్తలు తీసుకున్నారని అన్నారు. 
తెదేపాది రాజకీయ ఆక్రోశం

విద్యుత్ సరఫరాలలో లోపాలు లేకుండా అవసరమైన చోట్ల జనరేటర్లు ఏర్పాటుచేశాం. చంద్రబాబూ..వరద ప్రాంతాల్లోని టిడిపి నేతలు,ఎంఎల్ ఏలను అడగండి మేం ఏమి చేశామో వారే చెబుతారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ చిల్లరగా మాట్లాడవద్దని సూచించారు. రాజకీయనేతలంటే చులకనపరిస్దితులు తేవద్దు.నేతలంటే ఏదంటే అది మాట్లాడతారనేభావన మీ మాటల వల్ల వచ్చింది. గతంలో వరదలు వచ్చినప్పుడు డ్రోన్ లతో అంచనాలు వేయాలని,టెక్నాలజీ వాడుకోవాలని మీరే చెప్పారు. నేడు అదే పాటిస్తే ఎందుకు వక్రభాష్యం తీస్తారు. మీ ప్రాణం ఒకటి పేద వాడి ప్రాణం మరోటా? చంద్రబాబుకు ఎంతసేపటికి ఆయన ఇల్లే కనిపిస్తోంది. డ్రోన్ వాడకంపై వివాదం అవసరంలేదని అయన అన్నారు. ఎందుకు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ మాకు,అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. మేం వైఫల్యం చెందామని టిడిపి నేతలు అంటున్నారు. అదే జరిగిఉంటే వరదల్లో గ్రామాలకు గ్రామాలే కొట్టుకుపోయేవి. చంద్రబాబు హయాంలో శ్రీశైలం పవర్ ప్లాంటే మునిగిపోయే పరిస్దితి చూశాం. ముఖ్యమంత్రి  వైయస్ జగన్ కమిట్మెంట్ ఉన్ననేత అని అన్నారు. అమెరికాలో సైతం పారిశ్రామికవేత్తలను ముఖ్యమంత్రి ని కలుస్తున్నారు.ఆంధ్రప్రదేశ్ కు రమ్మని చెబుతున్నారు.  వైయస్ జగన్ అమెరికా పర్యటనసు అద్బుతమైన స్పందన వస్తోంది. మీలాగా ప్రచారానికో,పబ్లిసిటికో వాడుకోవడం లేదు. పారిశ్రామికంగా ఎలా ఏపి అభివృద్ది చెందుతుందో వేచిచూస్తే తెలుస్తుంది. వరదల్లో అధికారులు సమన్వయంతో పనిచేశారు వారిని అభినందిస్తున్నాం. ఈరోజు ఓ పత్రికలో వచ్చింది కాగితపరిశ్రమ వెనకకు వెళ్లింది అని.పరిశ్రమలు ఏపినుంచి వెళ్లిపోతున్నాయని దుష్ప్రచారం చేస్తున్నారు. జగన్ పై పారిశ్రామికవేత్తలకు ఉన్న నమ్మకం నేపధ్యంలో ఈప్రచారాలు పనిచేయవు. దివంగత వైయస్ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు డిప్లమేటిక్ సదస్సు జరిగింది. తిరిగి నేడు జగన్ ముఖ్యమంత్రి అవగానే జరిగింది. ఈ సదస్సుకు 30 దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. చంద్రబాబూ కుటిల రాజకీయాలను కట్టిపెట్టండి.వాస్తవాలకు దగ్గరగా రండి.ప్రజలను ఇంకా ఇంకా మభ్యపెట్టకండని అన్నారు.