షాక్ ఇస్తున్న గుర్నాధరెడ్డి నిర్ణయాలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

షాక్ ఇస్తున్న గుర్నాధరెడ్డి నిర్ణయాలు

అనంతపురం ఆగస్టు 3, (way2newstv.com)
పార్టీలు మారుతూ వస్తుంటే రాజకీయంగా ఎలా దెబ్బతింటామో ఈ నేతను చూస్తేనే అర్థమవుతుంది. అధికారం కోసం పార్టీ మారినా అక్కడ ఎక్కువ కాలం మనుగడ సాగించలేకపోవడం, తర్వాత తిరిగి సొంత గూటికి చేరుకున్నా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోవడంతో ఆ నేత ఇప్పుడు ఎటూ కాకుండా పోయారంటున్నారు. అనంతపురం జిల్లాకు చెందిన బి.గురునాధరెడ్డి. గురునాధరెడ్డి ఆవేశంతో తీసుకున్న నిర్ణయాలు రాజకీయంగా ఆయన భవిష్యత్తును ఆయనే చేజేతులా నాశనం చేసుకున్నారన్న వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్స్ లో వినపడుతున్నాయి.2009లో కాంగ్రెస్ పార్టీ తరుపున అనంతపురం పట్టణ నియోజకవర్గం నుంచి గురునాధరెడ్డి విజయం సాధించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ప్రీతిపాత్రుడిగా గురునాధరెడ్డి ఉన్నారు. 
 షాక్ ఇస్తున్న గుర్నాధరెడ్డి నిర్ణయాలు 

వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణంతో ఆయన తనయుడు జగన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేయడంతో అందులోకి వచ్చేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరీ 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో తిరిగి గురునాధరెడ్డి విజయం సాధించారు.2014లో గురునాధరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసి ఓటమిపాలయ్యారు. టీడీపీ అభ్యర్థి ప్రభాకర్ చౌదరి గెలుపొందారు. అప్పటి నుంచి అనంతపురం వైసీపీ ఇన్ ఛార్జిగా గురునాధరెడ్డి కొంతకాలం కొనసాగారు. అయితే ఇన్ ఛార్జి పదవి నుంచి జగన్ కొన్ని రాజకీయ కారణాలతో తొలగించడంతో గురునాధరెడ్డి హర్ట్ అయ్యారు. కొంతకాలం సొంత పార్టీనే ఇబ్బందుల పాలుచేశారు. అయినా వైసీపీ అధిష్టానం గురునాధరెడ్డిపై మెతకవైఖరినే అనుసరించింది.తర్వాత జేసీ దివాకర్ రెడ్డి సూచనలతో గురునాధరెడ్డి రాత్రికి రాత్రి టీడీపీలో చేరిపోయారు. జేసీ దగ్గరుండి ఆయనను చంద్రబాబు వద్దకు తీసుకెళ్లారు. అనంతపురం టిక్కెట్ గాని, అనంతపురం అర్బన్ డెవలెప్ మెంట్ అధారిటీ ఛైర్మన్ పదవిని కాని ఇస్తామని మాట ఇచ్చారు. రెండూ ఇవ్వకపోవడంతో ఆయన తిరిగి వైసీపీలో ఎన్నికలకు ముందు చేరిపోయారు. ఇప్పుడు బలమైన నేత అనంత వెంకట్రామిరెడ్డి అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తుండటంతో గురునాధరెడ్డి ఇక రాజకీయంగా ఉనికిని కోల్పోక తప్పని పరిస్థితి ఏర్పడింది. పార్టీలు మారిన గురునాధరెడ్డిని జగన్ కూడా విశ్వసించే అవకాశం లేదు.