ప్రాజెక్టుల యాత్ర కాదు..హనీమూన్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ప్రాజెక్టుల యాత్ర కాదు..హనీమూన్

హైద్రాబాద్, ఆగస్టు 29 (way2newstv.com)
టీఆర్‌ఎస్, కేటీఆర్‌పై కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ చేసిన విమర్శలను టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఖండించారు. తమ్మిడిహట్టిపై కాంగ్రెస్ నేతలది హనీమూన్ యాత్ర అని, వారు నైరాశ్యంలో ఉండి అలా మాట్లాడుతున్నారని విమర్శించారు. కేంద్రం, రాష్ట్రంతోపాటు మహారాష్ట్రలో.. మూడుచోట్లా కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నప్పుడు తమ్మిడిహెట్టి వద్ద తట్టెడుమట్టి కూడా ఎందుకు తవ్వలేకపోయారని ప్రశ్నించారు. కానీ, సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం పెన్‌గంగ, మేడిగడ్డ, తమ్మిడిహట్టి వద్ద బరాజ్‌లు కట్టడానికి మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొన్నదని చెప్పా రు. ప్రపంచం అబ్బురపడేలా కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేశామన్నారు. 
 ప్రాజెక్టుల యాత్ర కాదు..హనీమూన్

కాంగ్రెస్ నేతల్లో నైరా శ్యం నెలకొన్నదని, అందుకే అవాకులు, చవాకులు పేలుతున్నారని అన్నారు. శ్రీరాజరాజేశ్వర (మిడ్ మానేరు) రిజర్వాయర్లో ఇప్పటికే 12 టీఎంసీల నీరు నిల్వచేశారని, ఇవేమీ చూడ ని కాంగ్రెస్ నాయకులు ఈర్ష్య, కండ్లమంట, కడుపుమంటతో కారుకూతలు కూస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని, సరైన సమయంలో వారికి బుద్ధి చెప్పడం ఖాయమని అన్నారు. తమ్మిడిహట్టి ప్రాజెక్టు ద్వారా 20 టీఎంసీలతో రెండు లక్షల ఎకరాలకు సాగునీటిని అందించడానికి సీఎం కేసీఆర్ సిద్ధంగా ఉన్నారన్నారు. హైదరాబాద్‌కు ప్రపంచస్థాయి కంపెనీలను తీసుకరావడంలో కేటీఆర్ పాత్ర కీలకమైనదని చెప్పారు. కేటీఆర్ కార్యదక్షత కారణంగానే హైదరాబాద్‌కు అంతర్జాతీయంగా ఇమేజ్ పెరిగిందన్నారు. నాలుగేండ్ల క్రితం ఇదే కాంగ్రెస్ నాయకులు బస్సుయాత్ర పేరుతో షికారు చేశారని, ఇప్పుడు మళ్లీ ఏదో సాధించాలని యాత్ర చేస్తున్నారని ప్రభుత్వ సలహాదారు వేణుగోపాలాచారి విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో ప్రాణహిత ప్రాజెక్టుకు రూ.10వేల కోట్లు ఖర్చుచేసి తట్టెడుమట్టి కూడా తవ్వలేదని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు మొబిలైజేషన్ అడ్వాన్స్‌ల రూపంలో కోట్ల్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ఇప్పించేందుకు ప్రయత్నించారని, ఆ విషయం అప్పుడే మర్చిపోయారా అని ప్ర శ్నించారు. కాంగ్రెస్ నేతల మాటలు దయ్యా లు వేదాలు వల్లించినట్టుగా ఉన్నదన్నారు. తమ్మిడిహట్టిపై ప్రజలను మభ్యపెట్టేందుకు వారు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.