నవరత్నాల్లోనూ మహిళలకు పెద్దపీట - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

నవరత్నాల్లోనూ మహిళలకు పెద్దపీట

వాసిరెడ్డి పద్మ
విజయవాడ అగష్టు 22   (way2newstv.com
 తనకు కేబినెట్ హోదా కల్పించిన ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ధన్యవాదాలు తెలిపారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి మహిళల కోసం అనేక మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారని కొనియాడారు. నవరత్నాల్లోనూ మహిళలకు పెద్దపీట వేస్తున్నారని వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు.  మధ్య నిషేదం అనేది మహిళలు జీవితాలలో పెను మార్పు తీసుకొని రాబోతోంది. ప్రతి ఇంటిలో కూడా మహిళలు గురుంచి ఆందోళన చెందుతున్నారు. మహిళా కమిషన్ అనేది మగవారికి వ్యతిరేకము కాదని అమె అన్నారు. 
నవరత్నాల్లోనూ మహిళలకు పెద్దపీట

నవ్యాంధ్రప్రదేశ్ మహిళలు పట్ల నేరాలు అగ్ర స్ధానంలో ఉంది అని.. దీనిపై కొన్ని కేసు స్టడీలపై చర్చించే అవకాశం ఉంది.  డ్వాక్రా మహిళలకు సంబంధించిన రుణాలు తీసుకొని వారు ఆర్ధికముగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పని చేస్తుంది.గతంలో జరిగిన తప్పులు వలన మహిళలు అప్పుల్లో కూరుకుపోయారు.  మహిళలు పట్ల చిన్న చూపు, వివక్షత బాగా పెరిగిపోయింది. ఆడ, మగ సమానం అనే భావన ఏర్పడేందుకు కృషి చేయాలని.. దీనిపై పిల్లలకు ప్రత్యేక తరగతులు చెప్పాలి.  సమాజంలో మహిళలపై నేరాలకు సంబంధించిన విషయాలు గురించి చూస్తే మనం ఎటు పోతున్నామో అర్థం కావడం లేదు.ఇది దురదృష్టమని ఆమె అన్నారు. మహిళా పక్షపాతి అయిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహకారంతో మేము ముందుకు వెళతామని.. మగ, ఆడ కలిసి సామరస్యంగా కలిసి వెళ్లే దానికి ఈ కమిషన్ పని చేస్తోంది. నేరాలపై  పోలీసు యంత్రాంగంను ఎలెర్ట్ చేస్తామని.. సీరియస్ గా మనం పనిచేస్తే అందరూ సహకరిస్తారని.. మీడియా కుడా సహకరించాలని.. కోరుతున్నాను. గ్రామ వార్డు సెక్రటరీ, వలంటీర్లు వ్యవస్ద ద్వారా మహిళలు భద్రతను మరింత సురక్షితంగా ఉంచేందుకు మంచి అవకాశం అని అనుకుంటున్నాని ఆమె అన్నారు.