బేర్ మంటున్న అమరావతి రైతులు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

బేర్ మంటున్న అమరావతి రైతులు

విజయవాడ, ఆగస్టు 19, (way2newstv.com)
అమరావతి నిర్మాణంపై వైఎస్ జగన్ ప్రభుత్వం క్లారిటీగానే ఉంది. అమరావతిలోనే రాజధాని నిర్మాణం జరుపుతామని చెబుతోంది. అయినా సరే అమరావతిలో భూముల ధరలు పడిపోయాయి. ఎలాగంటే ఇప్పుడు అమ్మేవారున్నా… కొనేవారు లేరు. ఎన్నికలకు ముందు కోటిన్నర పలికిన ఎకరం భూమి ధర ఇప్పుుడు సగానికి అమ్ముతామన్నా కొనే దిక్కులేకుండా పోయింది. అయితే ఇదంతా కృత్రిమ సృష్టి కావడం వల్లనే అసలు ధరలు ఇప్పుడు కనిపిస్తున్నాయని వైసీపీ నేతలు అంటున్నారు.వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర నెలలు దాటుతోంది. పాలనపై ఇప్పుడిప్పుడే జగన్ దృష్టిి పెడుతున్నారు. బడ్జెట్ లో అమరావతికి నిధులు కేటాయించలేదని, అమరావతిని మార్చేస్తున్నారన్న ప్రచారం ఇటు సోషల్ మీడియాలోనూ, అటు తెలుగుదేశం పార్టీ విస్తృతంగా ప్రచారం చేస్తోంది. 
బేర్ మంటున్న అమరావతి రైతులు

దీంతో అమరావతి ఉంటుందా? లేదా? అన్న సందేహాలు తలెత్తాయి. అయితే అమరావతిని మార్చే ప్రసక్తి లేదని జగన్ ప్రభుత్వం స్పష్టం చేస్తూనే ఉన్నా ప్రచారం మాత్రం ఆగడం లేదు. ఎందుకంటే జగన్ ప్రభుత్వం కూడా అమరావతికి అంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనపడటం లేదు.దీంతో భూముల ధరలు పూర్తిగా పడిపోయాయి. గతంలో రోజుకు పదుల సంఖ్యలో జరిగే రిజిస్ట్రేషన్లు ఇప్పుడు ఒకటి అరా జరుగుతుండటం విశేషం. అయితే భూములన్నీ ఇక్కడ ఒక వర్గం వారి చేతిలోనే ఎక్కువగా ఉండటంతో ఈ ప్రచారం వారే చేస్తున్నారన్న అనుమానం కూడా వైసీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. రాజధాని నిర్మాణాన్ని తాము పూర్తి చేస్తామని, సింగపూర్ తరహా అక్కరలేకుండా చూడ చక్కనైన రాజధానిని అమరావతిలోనే నిర్మిస్తున్నామంటున్నారు.మరోవైపు అమరావతి నిర్మాణాలు ఆగిపోవడం కూడా భూముల ధరలు పడిపోయాయని చెప్పాలి. అమరావతిలో ఇప్పటికే ఎమ్మెల్యే క్వార్టర్లు, మంత్రుల భవన సముదాయం, సచివాలయం వంటి నిర్మాణాల పనులు పూర్తి కావచ్చాయి. కొందరు ఎక్కువ ధరలు పెట్టి భూములు కొనుగోలు చేసి ప్లాట్ల విక్రయాలు చేపట్టారు. దీంతో ధర ఎక్కువగా ఉందన్నది వినియోగదారులు వెనక్కు తగ్గుతున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా ఉన్న ఆర్థికమాంద్యం కూడా అమరావతి భూముల ధరలు పడిపోవడానికి కారణమని కూడా అంటున్నారు. మొత్తం మీద మరో ఏడాదిలో అమరావతి మళ్లీ పుంజుకుంటుందని రియల్ ఎస్టేట్ రంగం నిపుణులు చెబుతున్నా ప్రస్తుతానికి మాత్రం భూములను కొనేవారే కరువయ్యారు