నామ్ కే వాస్తే గా మార్కెట్ కమిటీలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

నామ్ కే వాస్తే గా మార్కెట్ కమిటీలు

కడప, ఆగస్టు 17, (way2newstv.com
పంట దిగుబడులను కొనుగోలు చేసేందుకు జిల్లాలో 12 వ్యవసాయ మార్కెట్‌ కమిటీలను ఏర్పాటు చేశారు. వ్యవసాయ సీజనలో రైతులుకు రాయితీపై విత్తనాలు, ఎరువులు వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు అందిస్తాయి. అయితే పాలక వర్గాలు లేని మార్కెట్‌యార్డుల్లో అధికారులదే ఇష్టారాజ్యం కావడం, కొన్ని యార్డులకు కార్యదర్శలు కూడా లేక పర్సన ఇన్‌చార్జీలే ఉండటంతో రైతులకు సేవలు అందించడంతో మార్కెటింగ్‌శాఖ అధికారులు విఫలమవుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాయకుల మధ్య సమన్వయం కొరత, చైర్మన పదవి ఆశించేవారు ఎక్కువగా ఉండటం, నాయకులను సమన్వయ పరచడంతో ఎమ్మెల్యేలు విఫలమవడంతోనే మార్కెట్‌ కమిటీల నియామకంలో జాప్యం జరుగుతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నామ్ కే వాస్తే గా మార్కెట్ కమిటీలు

కడప, ప్రొద్దుటూరు, కోడూరు, బద్వేలు, జమ్మలమడుగు, పులివెందుల, మైదుకూరు, రాజంపేట, కమలాపురం, రాయచోటి, లక్కిరెడ్డిపల్లె, సిద్దవటం ప్రాంతాల్లో మార్కెట్‌ యార్డులు ఉన్నాయి. ఆయా చుట్టు పక్కల మండలాలను కమిటీల పరిధిలోకి చేర్చి అక్కడ పంట దిగుబడులను సదరు కమిటీలకు తీసుకెళ్లాలనేది ప్రభుత్వ ఉద్ధేశం. అలాగని ఇతర కమిటీలకు దిగుబడులను తీసుకెళ్లకూడదనే నిబంధనేమీ లేదు. దిగుబడులను తీసుకుని యార్డుకు వెళ్లి అక్కడ విక్రయించుకుని సెస్‌ రూపంలో కమిటీకి ఒకశాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అదే యార్డుకు ఆదాయం రూపంలో వచ్చే సొమ్ము. ఇవి కాక చెక్‌పోస్టులు నిర్వహిస్తుంటారు. ఈ ఆదాయాలను బేరీజు వేసుకుని ఏటా లక్ష్యం నిర్ధేశిస్తుంటారు. మార్కెట్‌ కమిటీలు తమకు ఇచ్చిన లక్ష్యాన్ని పూర్వమెప్పుడో చేశాయేమో కానీ ఇప్పుడు చేయలేకున్నాయి. నిరుడు జిల్లాలోని అన్ని కమిటీలకు కలిపి రూ.16.72 కోట్లు లక్ష్యం ఇచ్చారు. అయితే మార్చి ఆఖరుకు రూ.13,48,58,000లను వసూలు చేశాయి. అంటే ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యంలో రూ.3,23,42,00లను చేయలేకపోయాయని స్పష్టమవుతోంది. వీటిలో కడప యార్డులో మాత్రమే పంట దిగుబడులను విక్రయించుకుంటారు. కడప యార్డులో వ్యవసాయ, సుగంధ పంటల దిగుబడులు విక్రయించుకుంటారు. జిల్లాలో కొన్ని కమిటీలు లక్ష్యాన్ని చేరుకుంటే కొన్ని కమిటీలు అందుకోలేనంత దూరంగా ఉంటాయి. మరిన్ని లక్ష్యానికి మించీ చేస్తుంటాయి.రాష్ట్రంలోని 13 జిల్లాలో 191 వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు ఉన్నాయి. ఇప్పటి వరకూ 145 కమిటీలకు మాత్రమే పాలకవర్గాల నియామకం పూర్తయింది. మిగిలిన వాటికి ఇంత వరకూ ప్రతిపాదనలు పంపలేదు. దీంతో ఆ కమిటీల్లో రెండేళ్ల నుంచి కార్యదర్శులు, ఇన్‌చార్జీల పాలనే కొనసాగుతుంది. రాష్ట్రంలో 2015 జనవరి 22 నుంచి మార్కెట్‌ కమిటీల నియామక ప్రక్రియ ప్రారంభమైంది. అప్పుడు నియమించిన పాలకవర్గాలు ఇప్పటికే సంవత్సరం పూర్తి చేసుకుని మళ్లీ పదవీకాలం పొడిగించుకున్నాయి. మరో 23 కమిటీలు రెండోసారి పదవీకాలం పొడిగించుకోవడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపించాయి. ఇలా నియమించిన కమిటీలే పదవీకాలం పొడించుకుంటున్నాయిగానీ రెండేళ్ల నుంచి అసలు కమిటీలే నియమించిన మార్కెట్‌ యార్డుల నుంచి ఇంత వరకూ మార్కెటింగ్‌శాఖకు ఎలాంటి ప్రతిపాదనలూ అందలేదు. ఇప్పటికే ఖరీఫ్‌ ప్రారంభమై రెండు నెలలు గడిచిపోయింది.