జోరుగా సాగుతున్న హరిత హారం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

జోరుగా సాగుతున్న హరిత హారం

అదిలాబాద్, ఆగస్టు 09, (way2newstv.com)
అదిలాబాద్ జిల్లాలో 1216.60 హెక్టార్లలో అటవీ విస్తీర్ణం ఉంది. జిల్లా భౌగోళిక విస్తీర్ణం 3734.43 హెక్టార్లుకాగా.. ఈ లెక్కన అడవుల విస్తీర్ణం 32.58 శాతం ఉంది. జిల్లాలో కవ్వాల్ టైగర్ రిజార్వ్ ఫారెస్టులోని కోర్, బఫర్ ఏరియాలు ఉన్నాయి. జిల్లాలో 751.01 చదరపు కిలోమీటర్లలో కవ్వాల్ పులుల రక్షిత ప్రాంతం విస్తారించి ఉండగా ఇందులో 517.48 చ.కి.మి. కోర్ ఏరియా, 233.53 చ.కి.మి. బఫర్ ఏరియా ఉంది. జిల్లాలో తెలంగాణకు హరితహారంలో భాగంగా ఇప్పటికే పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. 2015 జూన్‌లో ప్రారంభించగా.. ఇప్పటికే మూడు విడతల్లో మొక్కలు నాటారు. తాజాగా నాలుగో విడతలో భాగంగా మొక్కలు నాటుతున్నారు. గతంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2015లో 3 కోట్లకుపైగా మొక్కలు నాటగా.. 2016లో నిర్మల్ జిల్లాలో 23 లక్షల మొక్కలు నాటారు.
జోరుగా సాగుతున్న హరిత హారం

2017లో 96 లక్షల మొక్కలకుగాను.. 59.60 లక్షల మొక్కలు నాటారు. 2018లో 1.02 కోట్ల మొక్కలను నాటేందుకు నిర్ణయించగా.. ఇప్పటికే పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నారు. జిల్లాలో మొత్తం 62 నర్సరీల్లో 1.12 కోట్ల మొక్కలను సిద్ధంగా ఉంచగా.. డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో 29 నర్సరీలు, అటవీశాఖ ఆధ్వర్యంలో 33నర్సరీల్లో మొక్కలు పెంచారు. అటవీశాఖ ఆధ్వర్యంలో 74లక్షల మొక్కలు, డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో 38.20లక్షల మొక్కలను పెంచారు.నాలుగో విడత హరితహారంలో భాగంగా 1,03,36,000 మొక్కలు నాటేందుకుగాను మొత్తం 31 ప్రభుత్వ శాఖల అధికారులు, యంత్రాంగం ముందుకు వచ్చారు. దీంతో జిల్లాలో 1,02,46,889 మొక్కలను నాటేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి మొక్కలు నాటే ప్రదేశాలు, శాఖల వారీగా లక్ష్యం కూడా నిర్దేశించారు. ఇప్పటి వరకు 51,34,309 మొక్కలు నాటేందుకు అవసరమైన గుంతలను ఉపాధి హామీ కూలీలు తీశారు. ఇందులో ఇప్పటి వరకు 47,82,842 మొక్కలను ఇప్పటికే వివిధ శాఖల ఆధ్వర్యంలో నాటారు. ఆయా ప్రాంతాల్లో నాటిన మొక్కలకు సంబంధించి ఎప్పటికప్పుడు జీయో ట్యాగింగ్ కూడా చేస్తున్నారు. ఇప్పటి వరకు 15,97,665 మొక్కలకు జీయో ట్యాగింగ్ కూడా చేశారు. జిల్లాలో ఇప్పటి వరకు 47.827 లక్షల మొక్కలను నాటగా.. 46.89శాతం లక్ష్యం చేరుకున్నారు. జీయోట్యాగింగ్‌కు సంబంధించి.. ఇప్పటి వరకు 34.40 శాతమే పూర్తి చేశారు. జిల్లాలో 1.02 కోట్ల మొక్కలను నాటేందుకు లక్ష్యంగా పెట్టుకోగా.. ఇందులో 60 శాతం గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటనున్నారు. ఒక్క గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలోనే 62 లక్షల మొక్కలను నాటుతున్నారు. ఉపాధిహామీ ద్వారా 50 లక్షలు, డీఆర్‌డీఏ ఐకేపీ ద్వారా 12 లక్షలు, అటవీశాఖ ద్వారా 22 లక్షలు, హార్టికల్చర్ ద్వారా 5లక్షలు, పంచాయతీరాజ్ (డీపీవో) ద్వారా 3 లక్షలు, ఇరిగేషన్, పోలీసు శాఖ ద్వారా 2 లక్షల చొప్పున, ఎక్సైజ్‌శాఖ ద్వారా లక్షన్నర, నిర్మల్ మున్సిపాలిటీలో లక్షన్నర, భైంసా మున్సిపాలిటీలో లక్ష చొప్పున మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు అత్యధికంగా గ్రామీణాభివృద్ధిశాఖ ద్వారా 26,47,580 మొక్కలు, డీఆర్‌డీఏ, ఐకేపీ ద్వారా 7,57,500 మొక్కలు నాటగా.. ఇందులో 10,47,574 మొక్కలకు జియోట్యాగింగ్ చేశారు. అటవీశాఖ ద్వారా 5,71,948 మొక్కలను నాటగా.. ఇందులో 5,24,452 మొక్కలకు జియోట్యాగింగ్ చేశారు. హార్టికల్చర్‌కు సంబంధించి 5లక్షల మొక్కలు నాటడం లక్ష్యం ఉండగా.. లక్ష్యానికి మించి 5,68,975 మొక్కలను ఇప్పటికే నాటారు. ఎక్సైజ్‌శాఖ ద్వారా 98,800 మొక్కలు, పంచాయతీరాజ్ (డీపీవో) ద్వారా 71,457 మొక్కలు, పోలీసుశాఖ ద్వారా 24,055, నిర్మల్ మున్సిపాలిటీ 10,790 మొక్కలను నాటారు.