వనపర్తి, ఆగష్టు 14 (way2newstv.com)
స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఏలాంటి పొరపాట్లకు తావివ్వకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి జిల్లా అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం ఆమె స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించే ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఏర్పాట్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె జాతీయ పతాక ఆవిష్కరణ కు చేసిన ఏర్పాట్లను, పోలీసు కవాతు, విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు, ఆహుతులకు ఏర్పాటుచేసిన షామియాన, కుర్చీలు తదితర ఏర్పాట్లను పర్యవేక్షించారు.
స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్ల తనిఖీ : జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి
అంతేకాక ఈ సంవత్సరం నిర్వహించే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగ ఏర్పాటు చేయనున్న నూతన ఆవిష్కరణల ప్రదర్శన ఏర్పాట్లను కూడా పర్యవేక్షించారు. వేడుకలకు హాజరయ్యే ప్రముఖులతోపాటు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆమె అధికారులకు సూచించారు. జాయింట్ కలెక్టర్ డి. వేణుగోపాల్, ఆర్ డి ఓ .చంద్రారెడ్డి, డి ఆర్ డి ఓ గణేష్, ఆర్ అండ్ బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, డిపిఆర్ఓ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ రజినీకాంత్, వనపర్తి తాసిల్దార్ రాజేందర్ గౌడ్ తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.
Tags:
News