పీడీఎస్‌ బియ్యం మాఫియా..? - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పీడీఎస్‌ బియ్యం మాఫియా..?

వరంగల్ ఆగస్టు 14, (way2newstv.com)
మాఫియా  కేంద్రంగా పీడీఎస్‌ బియ్యం  మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. పేదోడి బియ్యాన్ని చౌక ధరల దుకాణాల ద్వారా దళారులు వివిధ రూపాల్లో సేకరించి రైలు మార్గంగా మహారాష్ట్ర తరలిస్తున్నారు. ఈ మాఫియాలో విజయవాడ, డోర్నకల్‌, మానుకోట తదితర ప్రాంతాలకు చెందినవారు అక్రమమార్గంలో కోట్లకు పడగలెత్తుతున్నారు.. కాజీపేట జంక్షన్‌ నుండి నిత్యం రాత్రివేళల్లో బియ్యం రవాణా కొనసాగుతున్నా సివిల్‌ సఫ్లై, రైల్వే రక్షక దళం నామమాత్రపు దాడులు జరుగుతున్నాయి. దళారులు విజయవాడ, డోర్నకల్‌, మానుకోట మీదుగా విజయవాడ ప్యాసింజర్‌లో నగరానికి చేరుకుని చౌకధరల దుకాణదారుల దళారులతో ములాఖత్‌ అయి బియ్యం కొనుగోలు చేస్తున్నారు. 
పీడీఎస్‌ బియ్యం మాఫియా..?
స్థానికంగా ఉన్న మధ్య దళారులు అప్పటికే చౌక ధరల దుకాణాల ద్వారా సేకరించిన బియ్యాన్ని ఆటోలు, ఇతర వాహనాల ద్వారా కాజీపేట జంక్షన్‌కు చేరుస్తున్నారు. కాజీపేట జంక్షన్‌ నుండి రాత్రి అజ్నీ ప్యాసింజర్‌ ద్వారా బియ్యం రవాణా చేస్తున్నారు. నగరంలో చౌక ధరల దుకాణాలతో పాటు విడివిగా బియ్యం కొనుగోలు చేసి యథేచ్ఛగా రైల్వే స్టేషన్‌కు తరలిస్తున్నా రోడ్డు రవాణాను, రైలు రవాణాను వీరిని పట్టుకోకపోవడం నిఘా యంత్రాంగం వైపల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. పీడీఎస్‌ బియ్యాన్ని వ్యాపారంగా ఎంచుకుని కాజీపేటను కేంద్రంగా చేసుకుని దళారులు, వ్యాపారస్తులు కోట్లకు పడగలెత్తారు.ఈ నెల రెండో తేదీన 10 క్వింటాల పీడీఎస్‌ బియ్యాన్ని అజ్నీ రైలులో తరలించేందుకు ప్రయత్నిస్తుండగా జీఆర్పీ సిబ్బంది పట్టుకున్నారు. చౌక ధరల దుకాణాల్లో మొదటివారంలో అందుబాటులో ఉండే బియ్యాన్ని రెండో తేదీన రవాణా చేసేందుకు యత్నించారంటే చౌక ధరల దుకాణాల దళారులకు మారు బేరం చేసే వాళ్లకు ఉన్న సంబంధం ఎంత బలంగా ఉందో అర్థమవుతుంది. ప్రతినెలా జీఆర్పీ, ఆర్పీఎఫ్‌ సిబ్బంది కాజీపేట జంక్షన్‌లో సుమారు వెయ్యి క్వింటాలకు పైగా బియ్యాన్ని పట్టుకుంటున్నారంటే బియ్యం మాఫియా పెట్రేగిపోతున్న విధానం చేస్తుంటే అధికారులు సైతం కుమ్మక్కైయ్యారనే ప్రశ్న తలెత్తుతుంది. రైలు మార్గంగా వేల క్వింటాలు రవాణా జరుగుతుంటే రోడ్డుమార్గంగా నగరం నుండి యథేచ్ఛగా ఎన్ని క్వింటాలు తరలిపోతున్నాయని సామాన్య ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని మాసాలుగా బియ్యం సరఫరా సకాలంలో జరగడం లేదంటూ చౌకధరల దుకాణాల నిర్వాహకులు కార్డుదారులకు తెలియజేస్తూ సరఫరా జరిగిన మొదటివారంలో రెండో తేదీనే యథేచ్ఛగా పీడీఎస్‌ బియ్యాన్ని కాజీపేట జంక్షన్‌ మీదుగా సరఫరా చేస్తుండగా పట్టుబడడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గతమాసంలో సుమారు 15 సార్లకు మించి జీఆర్పీ సిబ్బంది పీడీఎస్‌ బియ్యాన్ని అక్రమరవాణా జరుగుతుండగా అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న బియ్యాన్ని సంబంధిత చౌకధరల దుకాణాలకు అందిస్తూ దళారులపై చర్యలు చేపట్టకుండా అధికారులు చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. చర్యలు చేపట్టకపోవడంతో బియ్యం రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. సివిల్‌ సఫ్లై అధికారులతో పాటు