చెన్నై అక్టోబర్ 30 (way2newstv.com)
తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఇవాళ ఆరు జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలను బంద్ చేశారు. శ్రీలంక తీర ప్రాంతంలో అల్ప పీడనం ఏర్పడింది. తిరునన్వేలీ, ట్యూటికోరిన్, తేని, విరుదునగర్, వెల్లోర్, రామనాథ పురం జిల్లాల్లో విద్యాలయాలను బుధవారం మూసివేశారు.
భారీ వర్షాలు .. తమిళనాట స్కూళ్లు, కాలేజీలు బంద్
మధురై జిల్లాలో ఉన్న అన్ని స్కూల్స్ను బంద్ చేశారు. తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని భారతీయ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురనున్నాయి. దీంతో ముందు జాగ్రత్తగా పాఠశాలలకు సెలవు ప్రకటించారు. శుక్రవారం వరకు వర్షాలు కురుస్తామని వాతావరణ శాఖ ప్రకటించింది.