సకాలంలో ఆర్జీల పరిష్కారానికి చర్యలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సకాలంలో ఆర్జీల పరిష్కారానికి చర్యలు

ఒంగోలు, ఆగస్టు 19,(way2newstv.com):
జిల్లాలో స్పందన కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన అర్జీలను సకాలంలో పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక ప్రకాశం భవనంలోని స్పందన ప్రజా సమాస్యల పరిష్కార వేదికను జిల్లా కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్బంగా  జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాల్లో స్పందన కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన అర్జీలను అర్ధవంతగా పరిష్కరించాలన్నారు. మీ సేవా కేంద్రాల ద్వారా ప్రజల నుండి వచ్చిన అర్జీలను ప్రభుత్వం విధించిన గడువులోపు పరిష్కరించాలని ఆయన అధికారులను ఆదేశించారు. అర్జీలను ప్రభుత్వం ఇచ్చిన గడువులోపు పరిష్కరించని అధికారులకు పోకాజు నోటిసు జారీచేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. 
సకాలంలో ఆర్జీల పరిష్కారానికి చర్యలు

నియోజకవర్గ ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అధికారులు తిరస్కరించిన అర్జీలను విశ్లేషించాలన్నారు. ప్రతి గురువారం నియోజకవర్గ ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు. జిల్లాలోని 12 నియోజకవర్గాలలో  పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని ఆయన అన్నారు. క్షేత్రస్థాయిలో అమలు జరుగుతున్న ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించాలన్నారు. స్పందన కార్యక్రమంలో పెద్దారవీడు మండలం దేవరాజుగట్టు గ్రామానికి చెందిన కె.ప్రసాద్ గురవయ్య తమ గ్రామంలో వాటర్ ట్యంక్ కు సంబంధించిన భూమిని కటికల నాగమ్మ, భర్త రామయ్య అనువారు వాటర్ ట్యాంక్ స్థలాన్ని ఆక్రమించి అక్రమంగా ఇళ్లు నిర్మిస్తున్నారన్నారు. వెంటనే చర్యలు తీసుకోని ఆక్రమణ తొలగించాలని అర్జీ ఇచ్చారన్నారు. ఈ విషయం పై పెద్దారవీడు తహశీల్దారును విచారణ  చేపట్టి తగు చర్యలు తీసుకోవలసిందిగా  ఆదేశించామన్నారు. తాళ్లూరు మండలం బెల్లంకొండ  వారి  పాలెం గ్రామానికి చెందిన ఎమ్.శ్రీనివాసరెడ్డి నారాయణ రెడ్డి  గమ గ్రామంలో నాగార్జునసాగర్ ఆయుకట్టు క్రింద 400  ఎకరాల భూములు వున్నామన్నారు. గత  15 సంవత్సరాలుగా సాగునీరు అందక వరుసగా కరువుకు గురువుతున్నామని తెలియజేశారన్నారు.  ఈ విషయం పై  జలవనరుల శాఖ ఎస్.ఇ.పరిశీలించి తగు చర్యు తీసుకోవలసిందిగా  ఆదేశించామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్.షన్ మోహన్, ఇన్ ఛార్జి జాయింట్ కలెక్టర్ -2 గంగాధర్ గౌడ్, జిల్లా రెవిన్యూ అధికారి వెంకట సుబ్బయ్య, వెంకటేశ్వర్లు,  సుబ్బరాజు, ఆర్.డబ్లు.ఎస్.సంజీవ రెడ్డి, వ్యవసాయ శాఖ శ్రీరామముర్తి, పశు సంవర్ధక శాఖ రవీంద్రనాద్ ఠగుర్,  విశాలక్షి డ్వామా పి.డి వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.