10 నెలలుగా జీతాల్లేని మిడ్ డే మీల్ హెల్పర్స్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

10 నెలలుగా జీతాల్లేని మిడ్ డే మీల్ హెల్పర్స్

హైద్రాబాద్, సెప్టెంబర్ 30, (way2newstv.com)
ప్రభుత్వ/ఎయిడెడ్‍  పాఠశాలల విద్యార్థులకు మిడ్‍ డే మీల్స్ అందించే హెల్పర్స్ కు గత 10 నెలలుగా జీతాలు అందడం లేదు. ప్రభుత్వ విద్యాశాఖాధికారులు రెండు రోజుల క్రితం బకాయి జీతాలు విడుదల చేసిన అందులోనూ అన్ని మండలాలకు నిధులు విడుదల కాలేదు. దాంతో జీతాలు అందక హెల్పర్స్ తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. జిల్లాలో 16 మండలాలు ఉన్నాయి. ఇందులో కేవలం 7 మండలాల్లోని మిడ్‍ డే మీల్స్ హెల్పర్స్ కు మాత్రమే బకాయి జీతాలు విడుదల చేశారు. ఇవి కూడా 2018–19 అకడమిక్‍ ఇయర్‍కు సంబంధించినవి కావడం గమనార్హం. మొత్తంగా 7 మండలాల పరిధిలో పనిచేస్తున్న 246 మందికి రూ.9.34 లక్షలు మంజూరు చేశారు.
10 నెలలుగా జీతాల్లేని మిడ్ డే మీల్ హెల్పర్స్

త్వరలోనే వీటిని హెల్పర్ల బ్యాంక్‍ అకౌంట్లో వేసే బాధ్యతను మండల విద్యాశాఖాధికారులకు అప్పగించారు.అమీర్‍పేట్‍ మండలంలోని 13మంది హెల్పర్లకు మూడు నెలల పెండింగ్‍ జీతాలు రూ.39 వేలు, ఆసిఫ్‍నగర్–1, 2లలో 46 మందికి రూ.1.36 లక్షలు(3 నెలలు), 45 మందికి రూ.2.25 లక్షలు(5 నెలలు), బహదూర్‍పురా–1లో  56 మందికి రూ.1.68 లక్షలు(3 నెలలు), చార్మినార్‍–2లో 33 మందికి రూ.99 వేలు (3 నెలలు), హిమాయత్‍నగర్‍లో  27 మందికి రూ.1.35 లక్షలు(5 నెలలు), ఖైరతాబాద్‍–2 మండలంలో 26 మంది హెల్పర్లకు రూ.1.30 లక్షలు(5 నెలలు) చెల్లించేందుకు విద్యాశాఖాధికారులు బడ్జెట్‍ను పే అండ్‍ అకౌంట్స్ కు విడుదల రిలీజ్‍ చేశారు. జిల్లా పరిధిలో ఇంకా 9 మండలాల పరిధిలోని దాదాపు 450 మంది మిడ్‍ డే మీల్స్ హెల్పర్లకు వేతనం గత అకాడమిక్‍ ఇయర్‍కు సంబంధించిన జీతాలు, 2019–20 అకాడమిక్‍ ఇయర్‍ ఇప్పటి వరకు వేతనాలు చెల్లించాల్సి ఉందని ఉపాధ్యాయులు తెలిపారు.జిల్లాలోని 16 మండలాల పరిధిలో ఉన్న 684 ప్రభుత్వ స్కూల్స్ తోపాటు ఎయిడెడ్‍ స్కూల్స్ లోనూ మిడ్‍ డే మీల్స్ సప్లై చేయడంతోపాటు స్టూడెంట్స్ తిన్న ప్లేట్లను కడిగి జాగ్రత్తగా భద్రపరిచే బాధ్యత హెల్పర్లదే. జిల్లా పరిధిలో అన్ని స్కూల్స్ కు సెంట్రల్‍ కుకింగ్‍ సిస్టంలోనే మిడ్‍డే మీల్స్ సరఫరా అవుతుంది. వచ్చిన మిడ్‍ డే మీల్స్ ను విద్యార్థులందరికి సప్లై చేయడంతో పాటు వారు తిన్న అనంతరం స్కూల్‍ ప్రాంగణాన్ని క్లీన్‍ చేసే బాధ్యతలు కూడా హెల్పర్‍వే. ఈ సేవలందించినందుకు వారికి నెలకు రూ.1000 చొప్పున చెల్లిస్తారు. ఇవి కూడా సకాలంలో చెల్లించకపోవడంతో చాలా స్కూల్స్ లలో ఏడాదిలో ఇద్దరు ముగ్గురు మారుతున్నారని హెడ్‍మాస్టర్లు పేర్కొంటున్నారు. కొన్ని స్కూల్స్ లో అసలు పనిచేసేందుకు వచ్చేందుకు ఎవరు ముందుకు రాని సందర్భాల్లో ఉపాధ్యాయులు/హై స్కూల్‍ స్టూడెంట్లే ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు. ఇంటి దగ్గర స్కూల్‍ ఉన్నందునా పిల్లల మొఖం చూసి జీతాలు నెల నెల రాకున్నా పనిచేస్తున్నాని ఓ ప్రభుత్వ స్కూల్‍ లో హెల్పర్‍గా పనిచేస్తున్న యాదమ్మ చెప్పడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తుంది.