విజయవాడ సెప్టెంబర్ 6, (way2newstv.com)
ఇంద్రకీలాద్రిలో ఈ నెల 29 నుంచి ఆగష్టు ఎనిమిదో తేదీ వరకు దసరా ఉత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాలకు సంబంధించి అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ఈవో సురేష్ బాబు వెల్లడించారు.శుక్రవారం అయన మీడియాతో మాట్లాడారు.మొదటిరోజు స్నపనాభిషేకం అనంతరం ఉదయం 9 గంటలకు దర్శనం ప్రారంభిస్తారు. మిగతా రోజుల్లో ఉదయం 3 గం నుండి రాత్రి 11 వరకు వరకు దర్శనం ఉంటుంది. మూల నక్షత్రం రోజు ఉదయం రెండు గంటల నుండి రాత్రి 11 గంటల వరకు దర్శనం ఉంటుందని అయన అన్నారు. దుర్గ గుడికి వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా క్యూలైన్లను ఏర్పాటు చేసారు.
ఈనెల 29 నుంచి దుర్గమ్మ దసరా ఉత్సవాలు
కొండ కింద ఉన్న వినాయకుడి దగ్గర నుండి క్యూ లైన్ ఏర్పాటు చేసారు. అని క్యూ లైన్లో వాటర్ ప్యాకెట్ షామియానా విద్యుత్ దీపాలు, భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లుచేయడం జరిగిందని అయన అన్నారు. ముఖ్యమైన ప్రదేశాలు నుంచి మైకు ప్రచార కేంద్రం, భక్తుల భద్రత దృశ్య సీసీ కెమెరాలు, జిల్లా కలెక్టర్ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటుచేసారు. వృద్దులు, దివ్యాంగులకు ప్రత్యేక వాహనాలు వైపుకు రాజీవ్ గాంధీ పార్కు వద్ద ఉచిత బస్సులు ఏర్పాటు చేసారు. రైల్వే స్టేషన్ వద్ద దేవాలయం సంబంధించిన బస్సులను నడిపిస్తారు. ఉచితప్రసాదం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసామని ఈవో అన్నారు.