ఏలూరు సెప్టెంబర్ 6, (way2newstv.com)
శుక్రవారం ఉదయం సమయానికి గోదావరిలో వరద పెరిగింది. దాంతో ముంపు మండలాల్లో రోడ్డుమార్గాలు నీట మునిగాయి. ఆ ప్రాంతాల్లో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. గత రెండు నెలలల్లోకొత్తూరు కాజ్వేపై వరదనీరు చేరడం ఇది ఐదోసారి. ముంపుమండలాలైన కుక్కునూరు, వేలేరుపాడుల్లోని పలు ప్రాంతాల్లోకి వరద చేరింది. వేలేరుపాడు గ్రామానికి అత్యంత సమీపంలో ఉన్నఎద్దువాగుపై 4అడుగుల మేర నీరు ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
మళ్లీ గోదావరిలో వరద నీరు
గోదావరిలో పోలవరం వద్ద గురువారం సాయంత్రం నాటికి 10.95 మీటర్ల మేర వరద ప్రవాహం చేరింది.శుక్రవారం ఉదయానికి మరింత పెరిగింది. గోదావరిపాయ వశిష్ఠలోనూ ప్రవాహం పెరిగిపోయింది. మరోవైపు, తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం గోదావరి తీరగ్రామాలకు మళ్లీ వరద రావడంతో గిరిజనగ్రామాల ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. దేవీపట్నం మండలంలోని గువ్వలపాలెం, ఏ.వీరవరం, తొయ్యూరు, దేవీపట్నం పొలాల్లోకి వరదనీరు చేరింది. ఆర్అండ్బీ రహదారులపైకి మూడు అడుగులమేర నీరు చేరడంతో రాకపోకలు నిలిచాయి. సీతపల్లి వాగు దండంగి వరకు వెనక్కి పోటెత్తడంతో సుమారు 36 గ్రామాలు వరద నీటితో చిక్కుకుపోయాయి.
Tags:
Andrapradeshnews