300 కోట్లు దాటుతున్న సైరా... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

300 కోట్లు దాటుతున్న సైరా...

హైద్రాబాద్, సెప్టెంబర్ 18  (way2newstv.com)
మెగాస్టార్ 'సైరా' సంచలనాలు షురూ అయ్యాయి. ఆ సినిమా నిర్మాణానికి రామ్ చరణ్ చేసిన రిస్క్ ఇప్పుడు పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది. ముందుగా 200 కోట్లు అని సినిమా మొదలుపెడితే అది 250 కోట్లకు చేరింది అని టాక్. కానీ సినిమా అనుకున్న టైమ్ కంటే లేట్‌గా రిలీజ్ అవుతుండడంతో బడ్జెట్ కూడా 300 కోట్లకు టచ్ అయినట్టు తెలుస్తుంది. 'సైరా'కి కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే 108 నుండి 110 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఓవర్సీస్‌తో పాటు మిగతా రాష్ట్రాల్లో బిజినెస్ మాత్రం అనుకున్న రేంజ్‌లో జరగలేదని వచ్చిన వార్తల్లో కాస్త నిజం ఉన్నా కూడా ఈ సినిమా టీమ్, ముఖ్యంగా నిర్మాత మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా, ధైర్యంగానే ఉన్నాడు.ఈ సినిమా ఇప్పుడు నాన్ థియేట్రికల్ రైట్స్‌లో చరిత్ర సృష్టిస్తుంది. ఇప్పటివరకు శాటిలైట్ రైట్స్‌లో రజినీకాంత్, అక్షయ్ కుమార్ నటించిన '2.0 ' సినిమాదే పైచేయిగా ఉంది. 
300 కోట్లు దాటుతున్న సైరా...

ఆ సినిమా శాటిలైట్ రైట్స్ 110 కోట్లకు అమ్ముడుపోయాయి. ఇప్పుడు 'సైరా' శాటిలైట్ రైట్స్ '2.0 ' ని కూడా దాటేసి కొత్త రికార్డ్స్ సృష్టించాయి.ఈ‌సినిమా అన్ని భాషలకు సంబందించిన శాటిలైట్ హక్కులను ఏకంగా 125 కోట్లు చెల్లించి దక్కించుకుంది జీ నెట్‌వర్క్. ఈ సినిమాకి బాలీవుడ్‌లో ఏర్పడిన క్రేజ్, చిరంజీవి గత సినిమా సాధించిన కలెక్షన్స్, ఈ సినిమాలో అన్ని భాషలనుండి స్టార్ హీరోస్ నటించి ఉండడంతో ఈ సినిమాకి ఇంత భారీ రేటు దక్కింది. తమిళ్‌లో నయనతార,విజయ్ సేతుపతి....వీళ్లిద్దరికీ సూపర్ క్రేజ్ ఉంది. కన్నడ నుండి సుదీప్ నటిస్తున్నాడు. సుదీప్ కి హిందీలో కూడా మంచి గుర్తింపు ఉంది. దానికి తోడు అమితాబ్ ఈ సినిమాలో కీలకపాత్ర పోషించడం అనే ఒకే ఒక్క విషయం వల్లసైరాకి బాలీవుడ్ పరంగా భారీ అడ్వాంటేజ్ దక్కింది.ఇక తెలుగులో చిరు చరిష్మా కి తిరుగులేదు. దాంతో సైరా శాటిలైట్ బిజినెస్‌లో చరిత్ర సృష్టించింది. అలాగే ఈ సినిమా డిజిటల్ రైట్స్ కూడా ఏకంగా 40 కోట్ల భారీ ధరకు అమ్ముడుపోయాయి. అమెజాన్ ప్రైమ్ ఈ మొత్తం చెల్లించి అన్ని భాషల డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు దక్కించుకుంది. దీంతో నాన్ థియేట్రికల్ హక్కుల ద్వారానే సైరా పెట్టిన పెట్టుబడిలో సగం పైగా రికవర్ చేసుకోగలిగింది. వందల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమాకి అంత రికవరీ అంటే చిన్న విషయం కాదు. ఇప్పుడు ఎలా చూసుకున్నా కూడా ప్రొడ్యూసర్స్ సేఫ్. మెగాస్టార్ క్రేజ్‌తో తెలుగు రాష్ట్రాల్లో సైరా బాక్సాఫీస్ ని బంతాడేస్తుంది అనే విషయంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. ఈ నాన్ థియేట్రికల్ బిజినెస్‌ రికార్డ్ తో 'సైరా'కి రిలీజ్‌కి ముందే సూపర్ కిక్ దక్కింది