హైద్రాబాద్, సెప్టెంబర్ 17 (way2newstv.com)
డిసెంబర్ నెలఖారు నాటికి కమాండ్ కంట్రోల్ అందుబాటులోకి వస్తుందని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ అసెంబ్లీలో ప్రకటించారు. పనుల పురోగతిపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇస్తూ 350 కోట్ల అంచనా వ్యయంతో సాగుతున్న పనులు తుదిదశకు చేరుకున్నాయని తెలిపారు.
31 నాటికి కమాండ్ కంట్రోల్ రూమ్
6.2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో డేటాసెంటర్, కమాండ్ కంట్రోల్ సెంటర్ విధులు నిర్వహిస్తాయని పేర్కొన్నారు. ఇది అంతర్జాతీయ ప్రమాణాలతో పోలీస్ సేవలు అందిస్తుంది. లక్షకు పైగా సీసీటీవీ కెమెరాలు అనుసాధించబడి, ట్రాఫిక్ నియంత్రణ, నేరాలను అదుపు చేయడంలో ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. అగ్నిమాపక, విపత్తుల నిర్వహణ, జీహెచ్‌ఎంసీ, ఆర్ అండ్ బీ, శాఖల సత్వర సమాచారం కోసం ఒక ఆపరేషన్ సెంటర్‌గా పనిచేస్తుందని తెలిపారు.