జ్వరాల విజృంభణ (మహబూబ్ నగర్) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

జ్వరాల విజృంభణ (మహబూబ్ నగర్)

మహబూబ్ నగర్, సెప్టెంబర్ 12 (way2newstv.com): 
వరుసగా వర్షాలు కురుస్తుండటంతో జిల్లావ్యాప్తంగా ప్రజలు విషజ్వరాల బారిన పడుతున్నారు. జిల్లా ఆసుపత్రితోపాటు ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలుజ్వరపీీడిత రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. ఆసుపత్రికి వచ్చినవారంతా రెండు మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నామని, ఎంతకూ తగ్గడం లేదంటూ వైద్యులతో మొరపెట్టుకుంటున్నారు.రోగులను పరీక్షించిన వైద్యులు మొదట విషజ్వరాలుగా భావించి అందుకు తగ్గట్టుగా చికిత్స చేస్తున్నా జ్వరం తగ్గకపోవడంతో డెంగీ జ్వరంగా అనుమానిస్తున్నారు. డెంగీ జ్వర నిర్ధరణకు సంబంధించిప్రభుత్వ ఆసుపత్రుల్లో పరీక్ష కిట్లు అందుబాటులో లేక జ్వరాన్ని తగ్గించేందుకు పలురకాల మందులు ఇస్తున్నారు. అయినా తగ్గకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రులు, ఆర్‌ఎంపీీలనుఆశ్రయిస్తున్నామని ప్రజలు చెబుతున్నారు. 
జ్వరాల విజృంభణ  (మహబూబ్ నగర్)

ఇదే అదనుగా భావించి కొందరు సామాన్యుల జేబుకు గాలం వేసి చిల్లులు పెడుతున్నారు. రక్తంలో ప్లేట్‌లెట్ల సంఖ్య తక్కువగా ఉందని.. డెంగీ నిర్ధరణఅయ్యిందంటూ భయపెట్టి అడ్డమైన దోపిడీ చేస్తున్నారంటూ ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రెండువేళలా ఓపీ సేవలు అందిస్తున్నా చికిత్స నిర్ధరణకు పరీక్ష కిట్లు లేక ప్రయోజనంలేకుండా పోతోంది. గత్యంతరం లేక ప్రైవేటు ఆసుపత్రులను, ఆర్‌ఎంపీీలను ఆశ్రయిస్తున్నారు. అక్కడ డెంగీ పరీక్ష తప్పనిసరి అంటూ తెలిసిన ల్యాబ్‌ ఫలానాచోట ఉందని సిఫార్సు చేస్తుండటంతోచేసేదిలేక జనం వెళ్లి పరీక్షలు చేయించుకుంటున్నారు. ఒక్కో ల్యాబ్‌లో ఒక్కో రీతిలో ఫీజులు వసూలు చేస్తుండటంతో రోగులు బెంబేలెత్తుతున్నారు. జిల్లాలో మొత్తం 29 ప్రయోగశాలలు, 42క్లినిక్‌లు, 18 ఆసుపత్రులున్నాయి.జిల్లా వైద్యారోగ్యశాఖ వివిధ పథకాల్లో భాగంగా కిందిస్థాయి వైద్యసిబ్బంది గ్రామాల్లోని ప్రతి ఇల్లూ తిరుగుతూ ఉంటారు. ఎవరికైనా జ్వరాలు వచ్చాయంటే, ఆరోగ్యపరంగా ఏదైనా సమస్య ఉంటే ప్రభుత్వఆసుపత్రికి వెళ్లాలని చెప్పాల్సిందిపోయి వారే రోగాన్ని నిర్ధరిస్తూ ఫలానా ప్రయోగశాలకు వెళ్లాలని సూచిస్తుండం గమనార్హం. రోగులు అలా పరీక్షలు చేయించుకున్న మరుసటిరోజు లేదా వా14రం రోజులతర్వాత ఆ ప్రయోగశాలల వద్దకు వెళ్లి తమ వంతు కమీషను ఇవ్వాలంటూ బేరసారాలు కొనసాగిస్తుండడం విస్మయానికి గురి చేస్తోంది. జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు మాత్రం ఇవేవీ పట్టనట్లువ్యవహరిస్తున్నారంటూ జనం వాపోతున్నారు.