జ్వరాల పంజా (కృష్ణాజిల్లా) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

జ్వరాల పంజా (కృష్ణాజిల్లా)

మచిలీపట్నం, సెప్టెంబర్ 13(way2newstv.com):
పూడుకుపోయిన కాలువలు మురుగునీటితో పొంగాయి. రహదారులపైకి చేరాయి.. పైపుల లీకేజీ కారణంగా నీళ్లు కలుషితమయ్యాయి. నివాస గృహాలవద్ద పందులు సంచరిస్తున్నాయి. పాఠశాలలు, ఇళ్ల సమీపంలోని చెత్తకుప్పలు పేరుకుపోయాయి. ఖాళీగా ఉన్న నివేశన స్థలాల వద్ద దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. జిల్లాలో జ్వరాలతోఇబ్బందులు పడుతున్న రోగులతో ఆస్పత్రులు నిండిపోయాయి. ఇటీవల ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు పట్టణం, పల్లెలు అనే తేడా లేకుండా పారిశుద్ధ్యం అధ్వానంగా మారింది. జిల్లాలోని 8పురపాలక సంఘాలతో పాటు 980 పంచాయతీల్లో మురుగునీటి పారుదల వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. కాల్వల్లో పూర్తిస్థాయిలో పూడిక తీయకపోవడం, ఎక్కడికక్కడ మురుగునీరు నిలిచిఉండటంతో ఒక్కసారిగా దోమల ఉద్ధృతి పెరిగింది.
జ్వరాల పంజా (కృష్ణాజిల్లా)

సాయంత్రం 5 గంటల నుంచే దోమలు తమ ప్రతాపం చూపిస్తున్నాయి. చీకటి పడక ముందే ప్రజలు తలుపులు వేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.ముందుగానే స్పందించాల్సిన అధికారులు కాస్త మందగించారు. జ్వరాల తీవ్రత పెరిగిన తరువాత పారిశుద్ధ్య చర్యలు మెరుగుపర్చడం, దోమల నివారణకు మలాథియాన్‌ మందు పిచికారి చేయడంచేపట్టింది.50 పడకల సామర్థ్యం కలిగిన తిరువూరు ప్రాంతీయ వైద్యశాలలో గడిచిన పది రోజులుగా ఓపీ అనూహ్యంగా పెరిగింది. ప్రస్తుతం ఆయా రుగ్మలతో రోజుకు 350 మంది వరకు చికిత్స నిమిత్తం  వస్తున్నారు. వీరిలో 170 మంది వరకు జ్వరపీడితులు ఉంటున్నారు. ఇన్‌పేషెంట్‌ వార్డులో 48 మంది వరకు చికిత్స పొందుతున్నారు. సగటున 8 టైఫాయిడ్‌ కేసులు నమోదవుతున్నాయి.తిరువూరు పట్టణంలో ప్రైవేటు వైద్యశాలలు 15 వరకు ఉన్నాయి. ఒక్కో వైద్యశాలలో రోజుకు 150 నుంచి 350 వరకు ఓపీ నమోదవుతోంది. పడకల సామర్థ్యానికి మించి ఇన్‌పేషెంట్లనుచేర్చుకుని చికిత్స అందిస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు రోగులతో కిటకిటలాడుతూ దర్శనమిస్తున్నాయి.  కైకలూరు నియోజకవర్గంలోని సోమవారం నాటి పరిస్థితి గమనిస్తే కొల్లేటికోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 7గురు, సీతనపల్లిలో 8 మంది, కైకలూరు సామాజిక ఆసుపత్రిలో 21 మంది చికిత్స పొందుతున్నారు.  బంటుమిల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 10మంది వరకూ జ్వరపీడితులున్నారు.వర్షాలు కాస్తా ఆలస్యంగా ప్రారంభం కావడంతో ఆగస్టులో ప్రారంభమైన జ్వరాల తీవ్రత పెరుగుతూ వచ్చింది. ప్రతి ఇంట్లో పిల్లల నుంచి పెద్దల వరకు జ్వరం బారిన పడిన వారే ఉన్నారు. ఇప్పటి వరకుజిల్లాలో డెంగీ కేసులు నమోదు కాలేదని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేస్తుండగా, ప్రైవేటు వైద్యశాలల నిర్వాహకులు మాత్రం డెంగీ, రక్తఫలికలు ఏమేరకు లోపించాయో తెలుసుకొనేందుకుపరీక్షల పేరిట ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నారు. ప్రభుత్వ వైద్యశాలల్లో పూర్తిస్థాయిలో మందులు అందుబాటులో ఉన్నా ఎక్కువ మంది ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ఇదేఅదనుగా పరీక్షలు, చికిత్స పేరిట చేతిచమురు వదిలిస్తున్నారు. కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో నిబంధనలకు విరుద్ధంగా డెంగీ నిర్ధరణ పరీక్షలు చేస్తున్నారు. తెల్లరక్త కణాలు పడిపోయాయంటూ ఒక్కో రోగినుంచి రూ. 10 వేల నుంచి రూ.40 వేల వరకు ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు.జిల్లాలోని మచిలీపట్నం, గుడివాడ, కైకలూరు, పెడన, నూజివీడు, నందిగామ, తిరువూరు, మైలవరం, జగ్గయ్యపేట, తదితర నియోజకవర్గాల పరిధిలోని ప్రజలు జ్వరాలతో వణికిపోతున్నారు.పైపులైన్ల లీకేజీల వల్ల రంగు మారి కలుషితమైన తాగునీటిని ప్రజలకు సరఫరా చేస్తున్నారు. కాచి వడకట్టి చల్చార్చిన నీటినే తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. జ్వరాలతో పాటు ఒక్కో వైద్యశాలలో8 నుంచి 30 మంది వరకు టైఫాయిడ్‌ బాధితులు చికిత్స పొందుతున్నారు. చికిత్స పొంది ఆరోగ్యం కుదుటపడిన 15 నుంచి 20 రోజుల తరువాత కూడా కీళ్లు, ఒళ్లు నొప్పులతోనిరసించిపోతున్నారు. ఈ ఏడాది జ్వరాల తీవ్రత అధికంగా ఉందని గుర్తించిన ఆరోగ్యశాఖ అధికారులు నివారణ దిశగా చర్యలు చేపడుతున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గత కొద్ది రోజులుగాపల్లెల్లో దోమల నివారణకు మలాథియాన్‌ మందును పిచికారి చేస్తున్నారు. కొన్ని పట్టణ ప్రాంతాల్లో ఇటీవల ప్రారంభించారు. జ్వరాల తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఆరోగ్యశాఖ సిబ్బంది ఇంటింటిసర్వే చేస్తూ వివరాలు సేకరిస్తున్నారు. జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్న వారికి మందులు అందజేస్తున్నారు. అదుపులోకి రాని ప్రాంతాల్లో ప్రత్యేక వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నారు.రక్తనమూనాలు సేకరిస్తూ వ్యాధి నిర్ధరణ పరీక్షలు చేస్తున్నారు.