మెట్రో నిర్మాణ లోపాలే ప్రమాదానికి కారణం... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మెట్రో నిర్మాణ లోపాలే ప్రమాదానికి కారణం...

హైద్రాబాద్ సెప్టెంబర్ 23, (way2newstv.com)
హైదరాబాద్ అమీర్‌పేట మెట్రో స్టేషన్ దగ్గర విషాద ఘటన జరిగింది. స్టేషన్ మెట్ల దగ్గర పెచ్చులూడి మీద పడటంతో మహిళ చనిపోయింది. వర్షం కురుస్తుండటంతో మహిళ స్టేషన్ మెట్ల దగ్గరనిలబడింది. ఈలోపు రెయిలింగ్ ఒక్కసారి ఊడి ఆమెపై పడింది. తీవ్రంగా గాయపడిన ఆమెను హుటా హుటిన ఆస్పత్రికి తరలించారు.. అక్కడ చికిత్సపొందుతూ చనిపోయింది.మెట్రో స్టేషన్లను సైతంప్రీకాస్ట్‌ విధానంలో నిర్మించారు. అంటే ముందుగా స్టేషన్‌కు అవసరమైన సెగ్మెంట్ల తయారీని ఉప్పల్, మియాపూర్‌ కాస్టింగ్‌ యార్డులో సిద్ధం చేసి ఆ తర్వాత స్టేషన్లు నిర్మించిన చోట అమర్చారు. 
మెట్రో నిర్మాణ లోపాలే ప్రమాదానికి కారణం...

పిల్లర్లు,వాటిపై ఏర్పాటు చేసిన వయాడక్ట్‌ సెగ్మెంట్ల మధ్య నున్న ఖాళీ ప్రదేశాన్ని కాంక్రీట్‌ మిశ్రమంతో మూసివేశారు. ఇక్కడే పొరపాట్లు జరిగినట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ పనులను హడావుడిగాచేపట్టడంతో మెట్రో రైలు వెళ్లే సమయంలో ప్రకంపనలకు కాంక్రీట్‌ పెచ్చులూడి తరచూ కింద పడుతుందని తేల్చారు.ఇది మెట్రో ప్రయాణికులు, రహదారి మార్గంలో వెళ్లే వాహనదారుల పాలిట శాపంగామారుతోందని హెచ్చరిస్తున్నారు. ఆదివారం జరిగిన ఘటనకు సైతం ఇదే కారణమని అభిప్రాయ డుతున్నారు. కాగా, గ్రేటర్‌ సిటీలో మెట్రో ప్రాజెక్టు 2017 నవంబర్‌లో ప్రారంభమైంది. రెండేళ్లవ్యవధిలోనే ఇలాంటి ఘటన జరగడం మెట్రో ప్రాజెక్టులోని డొల్లతనాన్ని బయటపెడుతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు