జగన్ ప్రభుత్వం రివర్స్ రికార్డ్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

జగన్ ప్రభుత్వం రివర్స్ రికార్డ్

విజయవాడ, సెప్టెంబర్ 23, (way2newstv.com)
పోలవరం రివర్స్ టెండరింగ్‌తో జగన్ సర్కార్ కొత్త అధ్యాయానికి తెరతీసింది. దేశంలో ఎక్కడా లేని విధంగా రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. గత వారం 65 వ ప్యాకేజీ పనులకు రివర్స్ టెండర్లు పిలిచిన ప్రభుత్వం.. సోమవారం పోలవరం ప్రాజెక్ట్ హెడ్‌వర్క్స్, జలవిద్యుత్ కేంద్రం నిర్మాణ పనులకు రివర్స్ టెండర్లు నిర్వహించింది. రివర్స్ టెండర్లతో ప్రభుత్వానికి రూ.628 కోట్ల భారీ లబ్ధి చేకూరింది.వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పోలవరం టెండర్లు రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. పోలవరం టెండర్లలో భారీగా అవినీతి జరిగిందని, రివర్స్ టెండరింగ్ విధానంలో టెండర్లు పిలిచి పనులు అప్పగిస్తామని జగన్ సర్కార్ తెలిపింది. అందులో భాగంగానే పోలవరం ప్రాజెక్ట్ పనులకు సంబంధించి రివర్స్ టెండరింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. 
 జగన్ ప్రభుత్వం రివర్స్ రికార్డ్

గత వారం 65 వ ప్యాకేజీ పనులకు రివర్స్‌ టెండర్లు నిర్వహించగా సుమారు రూ.58 కోట్లు ఆదా అయ్యాయి. అవే పనులకు గత ప్రభుత్వ హయాంలో వేసిన బిడ్ కంటే 15.6 శాతం తక్కువకు అదే కంపెనీ టెండర్ వేయడం తెలిసిందే. పోలవరం హెడ్‌వర్క్స్‌, జలవిద్యుత్ కేంద్రాలకి ఏపీ ప్రభుత్వం రివర్స్ టెండర్లు నిర్వహించింది. అంచనా వ్యయం కంటే 12.6 శాతం తక్కువకు బిడ్ ఖరారైంది. వ్యయం అంచనా రూ.4987 కోట్లు కాగా రూ.4,358 కోట్లకు మేఘా సంస్థ బిడ్ దాఖలు చేసింది. గతంలో వివిధ సంస్థలు చేపట్టిన ధర కంటే తక్కువకు పనులు చేపట్టేందుకు మేఘా సంస్థ ముందుకొచ్చింది. దీంతో ఏపీ ప్రభుత్వానికి రూ.628 కోట్లు ఆదా అయ్యాయి.దేశంలో ఇంతవరకు ఎక్కడా లేని విధంగా ఎల్-1గా వచ్చిన సంస్థ కోట్ చేసిన ధరను ప్రాథమిక అంచనా వ్యయాంగా పరిగణలోకి తీసుకుని దాని ఆధారంగా బిడ్డింగ్ నిర్వహించారు. జల విద్యుత్ కేంద్రంతో పాటు ప్రధాన కాంక్రీట్ నిర్మాణ పనికి రూ.4,987 కోట్లకు ప్రభుత్వం టెండర్ పిలవగా మేఘా సంస్థ ఒక్కటే టెండర్ దాఖలు చేసింది. దీంతో టెండర్ మేఘా సంస్థకు ఖరారైంది. కోర్టు అనుమతులు లభించిన వెంటనే సంస్థ నిర్మాణ పనులు ప్రారంభించనుంది. ప్రభుత్వం నిర్ధేశించిన గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేయాలని సర్కార్ కాంట్రాక్ట్ సంస్థను ఆదేశించింది.