విజయవాడ సెప్టెంబర్ 9, (way2newstv.com)
ఈనెల 25వతేదీ నాటికి దసరా ఏర్పాట్లను పూర్తి చేయాలని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. సోమవారం ఉదయం అయన విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా ఏర్పాట్లను పర్యవేక్షించారు.వినాయకుడి గుడి వద్ద నుంచి కొండ పైభాగం వరకు తీసుకోవాల్సిన ఏర్పాటుపై వివిధ శాఖల అధికారులతో పరిశీలించారు.
ఇంద్రకీలాద్రిలో దసరా ఏర్పాట్లు
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలనిఆదేశించారు. కేశఖండనాల ఏర్పాటుపై అధికారులతో చర్చించినట్లు తెలిపారు. దసరా ఏర్పాట్లను ఈనెల 25 నాటికి పూర్తిచేయ్యేలా ప్రణాళిక రూపొందిచామని అన్నారు. దసరా ఉత్సవాలకు ఫ్లై ఓవర్పనులు ఆటంకం కలుగుతాయనే ఉద్దేశంతో పరికరాలను తొలగించాలని ఆదేశించామని అయన అన్నారు.
Tags:
Andrapradeshnews