వంద రోజుల పాలన అద్భుతం :కన్నా - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

వంద రోజుల పాలన అద్భుతం :కన్నా

గుంటూరు, సెప్టెంబర్ 9 (way2newstv.com)
ఏపీ, తెలంగాణల్లో బలపడటానికి బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ప్రాంతాల వారీగా బలపడేందుకు ఆ పార్టీ యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తోంది. ఏపీలో రాయలసీమ సమస్యను హైలెట్ చేస్తోన్న బీజేపీ.. తెలంగాణలో హిందూత్వం, బీసీ మంత్రాన్ని బలంగా తెర మీదకు తెస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ బీజేపీ నేతలు ఏపీలో, ఆంధ్రా కమలనాథులు తెలంగాణలో పర్యటిస్తున్నారు. తాజాగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి గుంటూరు వెళ్లారు.కిషన్ రెడ్డికి ఆంధ్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఘనంగా స్వాగతం పలికారు. 
వంద రోజుల పాలన అద్భుతం :కన్నా

అనంతరం ఇద్దరూ కలిసి గుంటూరులో ఏర్పాటు చేసిన 30 అడుగుల మట్టి గణపతి విగ్రహాన్ని సందర్శించారు.గంగానది తీరం నుంచి తీసుకొచ్చిన మట్టితోనే ఈ విగ్రహాన్ని రూపొందించారని కిషన్ రెడ్డి తెలిపారు. గుంటూరు గణేశ్ ఉత్సవ్ కమిటీ ఆహ్వానం మేరకు గణనాథుణ్ని సందర్శించుకున్నానని ఆయన చెప్పారు.అనంతరం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఎన్డీయే ప్రభుత్వం వంద రోజుల పాలనలో అద్భుత నిర్ణయాలను తీసుకుందన్నారు. దేశ సమగ్రత కోసం మోదీ సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారని కొనియాడారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే భారత్ 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతుందన్నారు.