తెలంగాణలో కొత్త మెటర్ వాహాన చట్టం ఉండదు : కేసీఆర్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

తెలంగాణలో కొత్త మెటర్ వాహాన చట్టం ఉండదు : కేసీఆర్

హైద్రాబాద్, సెప్టెంబర్ 16 (way2newstv.com)
తెలంగాణలోని వాహనదారులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నూతన మోటార్ వాహన చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయబోమని స్పష్టం చేశారు. ఈ మేరకు తెలంగాణ బడ్జెట్ సమావేశాల సందర్భంగా కేసీఆర్ అసెంబ్లీ ప్రకటన చేశారు. కేంద్ర మోటార్ వాహన చట్ం పరిస్థితిపై ఎంఐఎం ఎమ్మెల్యే మోజంఖాన్‌ అడిగిన ప్రశ్నకు సీఎం సమాధానమిచ్చారు. రాష్ట్రానికి సంబంధించిన చట్టాన్ని మనమే రూపొందించుకుందామని కేసీఆర్ చెప్పారు. భారీ చలానాల పేరుతో ప్రజలను ఇబ్బంది పెట్టే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. 
తెలంగాణలో కొత్త మెటర్ వాహాన చట్టం ఉండదు : కేసీఆర్

దీంతో రాష్ట్రంలోని వాహనదారులకు భారీ ఊరట లభించింది.ట్రాఫిక్ నిబంధనలను సరిగా పాటించకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం గత పార్లమెంట్ సమావేశాల్లో నూతన మోటారు వాహనాల చట్టాన్ని అమలులోకి తెచ్చింది. ఈ చట్టం ద్వారా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘించినప్పుడు విధించే జరిమానాల మొత్తాన్ని భారీగా పెంచింది.ఈ చట్టాన్ని కొన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నప్పటికీ, చాలా రాష్ట్రాలు వ్యతిరేస్తున్నాయి. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కొత్త చట్టాన్ని తమ రాష్ట్రంలో అమలు చేయబోమని ప్రకటించింది. దీనితో పాటు ఏకంగా బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా చట్టాన్ని అమలు చేయడానికి వెనకడుగు వేస్తున్నాయి.మరోవైపు వాహన దారులు కూడా కొత్త మోటార్ వాహన చట్టంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్న చిన్న పొరపాట్లకు కూడా ఇంత భారీ పెనాల్టీలు చెల్లించాలా? అని ప్రభుత్వంపై మండి పడుతున్నారు. పొరపాటున నిబంధనలు ఉల్లంఘిస్తే ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుందంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు