టీటీడీ పాలకమండలి నిర్ణయాలు ఇవే - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

టీటీడీ పాలకమండలి నిర్ణయాలు ఇవే

తిరుమల సెప్టెంబర్ 23, (way2newstv.com)
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సోమవారం చైర్మైన్ వైవి సుబ్బారెడ్డి అధ్యక్షతన సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రమణధీక్షితులు వ్యవహరం కోర్టు పరిధిలో వున్నందున ఆ అంశంపై పాలకమండలిలో చర్చించలేదని వైవి సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమలలో శాశ్వత ప్రాతిపదికన నీటి సమస్యను పరిష్కరించేందుకు బాలాజీ రిజర్వాయర్ నిర్మిస్తామన్నారు. 
టీటీడీ పాలకమండలి నిర్ణయాలు ఇవే

అవిలాల ట్యాంక్ అబివృద్ధికి కేటాయించిన నిధులను బాలాజీ రిజర్వాయర్ నిర్మాణానికి మల్లిస్తామన్నారు. టీటీడీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు సబ్ కమిటిని నియమిస్తామని ఆయన తెలిపారు. ఏపీ రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న శ్రీవారి ఆలయానికి గత ప్రభుత్వం కేటాయించిన రూ.150 కోట్లను ప్రస్తు అవసరాల మేరకు రూ. 36 కోట్లకు కుదింపు చేసినట్లు చైర్మైన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. తిరుపతిని స్మార్ట్ సిటిగా ప్రకటించిన తరువాత టీటీడీ నిధులు కేటాయింపు చెయ్యడం సమంజసం కాదన్నారు. గరుడ వారధికి ప్రభుత్వంతో సంప్రదించిన అనంతరం నిధులు కేటాయిస్తామని వైవి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు