మక్కా తీర్థయాత్రకు వెళ్లే భక్తులకు ఘన సన్మానం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మక్కా తీర్థయాత్రకు వెళ్లే భక్తులకు ఘన సన్మానం

 ఉమ్ర యాత్ర పవిత్ర మైనది : వహాబ్
ఎమ్మిగనూరు సెప్టెంబర్ 23  (way2newstv.com)
సంవత్సరకాలంలో ముస్లింలు ఎపుడైననూ మక్కా తీర్థయాత్ర చేస్తే దానిని ఉమ్రా అంటారు.ప్రతి ముస్లిం జీవితంలో ఒక్కసారైన హజ్ యాత్రకు వెళ్లాలని కోరుకుంటారు అందులో భాగమే ఉమ్ర.ఉమ్రా యాత్రకు వెళ్తున్న సందర్భంగా ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన స్పిన్నింగ్ మిల్ ఉద్యోగి ఖాసింసాహేబ్,వారి సతీమణి హస్మత్ బి లను లక్ష్మీపేటలో ఆదివారం ప్రిన్స్ స్వచ్చంద సేవ సమితి అధ్యక్షుడు వహాబ్ వారి సభ్యులతో కలసి పూలమాలలతో శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.
మక్కా తీర్థయాత్రకు వెళ్లే భక్తులకు ఘన సన్మానం

ఈ కార్యక్రమానికి ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ..ఇస్లాం ఐదు ధర్మాల్లో హజ్యాత్ర ఒకటన్నారు.అందులో అర్ధ భాగం ఉమ్ర అన్నారు.ఉమ్ర యాత్ర ఎంతో పవిత్రమైనదని, ఉమ్ర యాత్ర చేయడం వల్ల పుణ్యం దక్కుతుందన్నారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు హనీఫ్,అబ్దుల్లా, రఫిక్,వెంకటేశ్వర్లు,నరసింహారాజు,విజేతనాగరాజు, శ్రీనివాసులు,విశ్వనాథ్ రమేష్,చంద్రమోహన్,ఈరన్న,చాంద్,శ్రీరాం,కర్ణ,రామకృష్ణ,ఖలందర్,బషీర్,భాష తదితరులు పాల్గొన్నారు.