జగన్ గోపీలకు ఓకే చెప్పేసినట్టేనా - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

జగన్ గోపీలకు ఓకే చెప్పేసినట్టేనా

విజయవాడ, సెప్టెంబర్ 4, (way2newstv.com)
ఏపీలో మళ్ళీ నేతల గోడ దూకుళ్ళు మొదలయ్యాయి. దీనికి రాజకీయ కారణలు లేకపోలేదు, మరో రెండు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికల్లో గెలవాలంటే లోకల్ లీడర్లు చాలా ముఖ్యం. బలమైన నాయకులను పార్టీలో చేర్చుకోవడం ద్వారానే అక్కడ సత్తా చాటగలరు ఎవరైనా. దాంతో వైసీపీ రాజకీయ తెలివిడిని ప్రదర్శిస్తోంది. మరో వైపు బీజేపీ ఇతర పార్టీ నాయకులకు గేలం వేయడాన్ని ఇన్నాళ్ళూ చూసీచూడనట్లుగా తీసుకున్న వైసీపీ ఇపుడే అప్రమత్తమవుతోంది. దానికి బీజేపీ మాటల దూకుడు, మారిన రాజకీయ వైఖరి కూడా మరో కారణం. విశాఖ జిల్లాలో బలమైన ఆడారి తులసీరావు కుటుంబం టీడీపీ నుంచి వైసీపీలోకి చేరిపోపోవడం శుభారంభం అంటోంది వైసీపీ. 
జగన్ గోపీలకు ఓకే చెప్పేసినట్టేనా

ఇంకా చాలా కధ ముందుంది అంటున్నారు ఆ పార్టీ నేతలు.ఆపరేషన్ ఆకర్ష్ పేరు మీద వైసీపీ  ఇపుడు రంగంలోకి దిగడానికి మారుతున్న రాజకీయమే అతి ముఖ్యమైన కారణమని అంటున్నారు. జగన్ ఫిరాయింపుల విషయంలో అసెంబ్లీలో ప్రకటన చేసే సమయానికి బీజేపీ పెద్దగా సౌండ్ చేయడంలేదు. టీడీపీ చతికిలపడి ఉంది. జనసేన ఊసే లేదు. ఇపుడు ఈ మూడు పార్టీలు మరో మారు ఒక్కటి అవుతున్నాయి. పైగా జగన్ మీద ఒంటికాలుతో లేస్తున్నాయి. బీజేపీ అయితే ఏపీలో తామే బలమైన పార్టీ అన్నట్లుగా తెగ బిల్డప్ ఇసోంది. నిజానికి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన ఆ పార్టీ జగన్ ని నానా మాటలు అంటోంది. టీడీపీ నుంచి వచ్చి చేరిన రాజ్యసభ ఎంపీలతో బీజేపీ తీరు కూడా మారిందని అంటున్నారు. దీంతో జగన్ సైతం అప్రమత్తం అయ్యారు. ఏపీలో అధికారంలో ఉన్న పార్టీకే ఏ నాయకుడు అయినా రావాలనుకుంటాడు, అక్కడ కుదరకపోతేనే బీజేపీ తలుపు తడతాడు. ఆ సంగతి గ్రహించిన వైసీపీ ఇపుడు బార్లా తలుపు తెరిచేసింది. దీంతో బీజేపీలోకి వలసలు ఆగిపోతాయి. టీడీపీకి గట్టి షాకులు తగులుతాయని అంటున్నారు.ముందుగా టీడీపీలోని మాజీ ఎమ్మెల్యేలు, బలమైన నాయకులే వైసీపీ టార్గెట్ గా ఉంది. దీనివల్ల రాజీనామాలు ఎవరూ చేయాల్సిన అవసరం కూడా లేదని, జగన్ మాటకు కూడా ఎక్కడా వ్రతభంగం రాదని భావిస్తున్నారు ఉత్తరాంధ్ర జిల్లాలతో సహా ఏపీలోనే చాలామంది టీడీపీ నేతలు ఇపుడు వైసీపీ వైపు చూస్తున్నారు, వారందరినీ రానున్న రోజుల్లో వరసగా చేర్చుకుని టీడీపీకి గట్టి ఝలక్ ఇవ్వాలని జగన్ డిసైడ్ అయ్యారని టాక్. ఇదే విషయాన్ని ఆ పార్టీ సీనియర్ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి కూడా చెబుతూ తమ పార్టీలోకి వెల్లువలా చేరికలు ఉంటాయని అన్నారు. ఇక 23 మంది ఎమ్మెల్యేల్లో కూడా ఎంపిక చేసిన కొంతమందిని చేర్చుకోవాలన్న ఆలోచన కూడా వైసీపీ చేస్తోందని టాక్. వారి చేత రాజీనామాలు చేయించి తిరిగి గెలిచేందుకు వీలుగా ఉంటేనే పార్టీలోకి తీసుకుంటారని అంటున్నారు. ఆ తతంగం లోకల్ బాడీ ఎన్నికల తరువాత మొదలవుతుందని చెబుతున్నారు. చంద్రబాబుకు ప్రతిపక్ష నేత పదవి ఉండాలంటే 18 మంది ఎమెల్యేలు ఉండాలి అందువల్ల కనీసం అరడజన్ కి తక్కువ లేకుండా టీడీపీ ఎమ్మెల్యేలను వైసీపీలోకి చేర్చుకుని పోటీ చేయించాలనుకుంటున్నారు. అదే జరిగితే అసెంబ్లీలో బాబుకు విపక్ష హోదా కూడా పోయి సౌండ్ పూర్తిగా లేకుండా పోతుందని అంటున్నారు. మరి చూడాలి వైసీపీ పాలిట్రిక్స్ ఎలా ఉంటాయో.