వనపర్తి సెప్టెంబర్ 9, (way2newstv.com)
నాడు గోపాలకృష్ణుడు గోవర్ధనగిరి పర్వతాన్ని చిటికెన వేలుతో ఎత్తి గోకులాన్ని ఏ విధంగా రక్షించాడో నేడు అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కూడా ప్రభుత్వ విప్ గా ఎదిగి జన్మనిచ్చిన సొంతగోపాల్పేట మండలాన్ని గోవర్దన పర్వతం ఎక్కించాడని జన్మనిచ్చిన గ్రామ ప్రజలు, మండల ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. గోపాల్పేట మండలం లోని పోలికేపహడు గ్రామానికి చెందినగువ్వల బాలరాజు పేద కుటుంబంలో జన్మించడం వల్ల పేదరికం అంటే అతనికి బాగా తెలుసు.
గోపాల్ పేటను గోవర్దన పర్వతం ఎక్కించిన గువ్వల
మౌనంగా ఎదగమని మొక్కనీకు చెపుతుంది , ఎదిగిన కొద్దీ ఓదగమని సిద్ధాంతం అతనిది. ఎంత ఎత్తుఎదిగినా ఒదిగి ఉండాలనే సిద్ధాంతం అతనిది. హైదరాబాద్ కు వలస వెళ్ళిన అతను ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని స్థిరపడ్డాడు. ఈ నేపథ్యంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా ,ఎవరికి ఏ కష్టం వచ్చినాఆదుకోవడమే కాకుండా పెళ్లిళ్లకు, గుడులకు, గోపురాలకు, విగ్రహాల ప్రతిష్టలకు ఆర్థిక సహాయాన్ని అందించి మంచి వ్యక్తిగా పేరు ప్రఖ్యాతలు గాంచాడు.2007లో నేటి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డినిరంజన్ రెడ్డి సమక్షంలో తెరాస లో చేరి గులాబీ కండువా కప్పుకున్నారు. తర్వాత రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం, పార్టీలో చురుకుగా వ్యవహరించడంతో ముఖ్య మంత్రి కేసీఆర్ ఆయనకుపార్టీ విప్ పదవిని కట్టబెట్టి సముచిత స్థానం కల్పించారు.
Tags:
News