అతలాకుతలం చేస్తున్న గోదావరి వరద - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అతలాకుతలం చేస్తున్న గోదావరి వరద

కాకినాడ సెప్టెంబర్ 9, (way2newstv.com)
తూర్పు గోదావరి జిల్లా.   రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం గోదావరిలోకి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల ప్రతాపం 34 గిరిజన గ్రామాలకు తప్పని ముప్పుగా మారుతుంది.వీరు చేసిన పాపం ఏమిటి? నీడ లేకుండా వీడని కష్టాలు. ఎటు చూసినా వరదే.  వరద ముంచేస్తుంది.గండి పోశమ్మ అమ్మవారి ఆలయం తాత్కాలికంగా మూసేశారు. పూడిపల్లి ఎస్ సి కాలనీలోకిభారీ వరద నీరు చేరి గ్రామంలో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. జూనియర్ కాలేజీ నీ భారీ వరద ముంచేసింది, తొయ్యేరు గ్రామంలో కనీసం త్రాగడానికి త్రాగు నీరు లేక తీవ్ర ఇబ్బందులుఎదుర్కొంటున్నామని అదేవిధంగా చిన్న పిల్లలకు పాలు కూడా అందడం లేదని తమ తల్లులు తల్లడిల్లిపోతున్నారు. 
అతలాకుతలం చేస్తున్న గోదావరి వరద

అధికారులు కనీసం చిన్నపిల్లల కైనా పాలు పంపించాలని వేగుకుంటున్నారు.  ఈ గ్రామాలలో ఎల్ఈడీ లైట్లు గతంలో అడపాదడపా ఇచ్చి మమ అనిపించారు అధికారులు అంటూ కాలనీనిర్వాసితులు తెలియజేస్తున్నారు. గత నెల ముంపుకు ప్రతి కుటుంబానికి ఐదు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది, అయితే అది ఆచరణలో లేదని వారు వాపోతున్నారు. పలుశాఖల మంత్రులు ఈ గ్రామాలను సందర్శించారు తప్ప ఏమీ చేయలేదని పలువురు విమర్శిస్తున్నారు. పలు రహదారులు రాకపోకలు నిలిచిపోయి మూడు రోజులు కావస్తున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదంటూ వరద నిర్వాసితులు గగ్గోలు పెడుతున్నారు. దేవీపట్నం ఏపీ టూరిజం భవనంలో 50 కుటుంబాలు ప్రస్తుతం నివసిస్తున్నా  వారిని అధికారులు పట్టించుకోలేదనిఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేవీపట్నం నుండి పెనికిలపాడు, మంటూరు, మడిపల్లి, అగ్రహారం, తదితర ముంపు గ్రామాల ప్రజలు జలదిగ్బంధంలో నే కొట్టుమిట్టాడుతున్నారు.