షర్మిలకు కీలక బాధ్యతలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

షర్మిలకు కీలక బాధ్యతలు

విజయవాడ, సెప్టెంబర్ 21, (way2newstv.com)
వై.ఎస్ షర్మిల  సోదరుడు జగన్ కు అండగా ఉంటూ రాత్రి… పగలు తేడా లేకుండా పాదయాత్రలు చేస్తూ… ముందుకు సాగారు.మీ కోసం జగనన్న వస్తున్నాడు….. మళ్లీ రాజన్న రాజ్యం వస్తుందంటూ ప్రసంగిస్తూ ప్రతి నియోజకవర్గంలో పంచ్ డైలాగులతో జనాలను ఆకట్టుకున్నారు షర్మిల. ఇలా ఓ వైపు షర్మిల, మరో వైపు ఆమె తల్లి విజయలక్ష్మిలు ఎన్నికల రోజుల్లో నిర్వహించిన ప్రచార సభలు హిట్టయ్యాయి.. దీని ఫలితమే గత ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం. జగన్ ముఖ్యమంత్రి కావడం.బాబు వస్తే జాబు వస్తుందన్నారు. ఎవరికి వచ్చింది? కేవలం చంద్రబాబు గారి కొడుకు లోకేష్‌కు మాత్రమే వచ్చింది. 
షర్మిలకు కీలక బాధ్యతలు

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు శాఖలకు మంత్రిని చేశారు. ఈ పప్పుగారు తెలుగు దేశం పార్టీలో ఉన్నారు కానీ తెలుగు రాదు. ఈ పప్పు లోకేష్‌కు కనీసం వర్ధంతికి , జయంతికి తేడా కూడా తెలియదు. అ… ఆలు రావు గానీ అగ్ర తాంబూలం నాకే కావాలన్నాడట ఎవరో. పప్పు తీరు కూడా అలాగే ఉందంటూ ప్రసంగించిన షర్మిల వ్యాఖ్యలు ఆకట్టుకున్నాయి. ఈ వ్యాఖ్యలు చేసిన రోజుల్లో ఎక్కడ చూసినా షర్మిల ప్రసంగమే వైరల్ అయ్యింది. ఈ సెంటిమెంట్ డైలాగులు జనాన్ని ఆకర్షించాయి.2004కు ముందు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాష్ట్రచరిత్రలో మొదటిసారిగా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. అప్పట్లో పార్టీలో వైఎస్ తన ఆధిపత్యాన్ని చాటుకోవాల్సిన పరిస్ధితి. అందుకు పాదయాత్రనే సరైన మార్గంగా భావించారు. వెంటనే రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ళ నుండి శ్రీకాకుళం జిల్లా వరకూ పాదయాత్ర చేశారు. రాష్ట్రానికి సంబంధించినంత వరకూ అప్పట్లో అదొక సంచలనం. ఆయన ప్రస్థానం ఇలా ముగిసింది. వై.ఎస్ మరణానంతంరం ఆయన కుమారుడు ప్రస్తుతం ఏపీ సీఎం జగన్ ను జైలులో పెట్టడంతో వై.ఎస్ తరహాలో షర్మిల పాదయాత్రలకు శ్రీకారం చుట్టారు. అన్నకు తోడుగా నిలబడి పాదయాత్రను విజయవంతం చేశారుఇలా షర్మిల ఎంతటి వారినైనా సూటిగా ప్రశ్నించారు. ఏకంగా నాటి ముఖ్యమంత్రి చంద్రబాబును, ఆయన కుమారుడు జాతీయ కార్యదర్శి లోకేష్ నే కాదు రంగులరాట్నంలో ఆరితేరిన చిరంజీవి, పవన్ కళ్యాణ్ ని సైతం వదలలేదు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌ పార్టీకి హోల్‌సేల్‌గా అమ్మేస్తే.. పవన్‌ కల్యాణ్‌ ఇప్పుడో ఎప్పుడో ఒకసారి టీడీపీకి హోల్‌సేల్‌గా అమ్మేస్తారని వైఎస్‌ షర్మిల విమర్శించారు. రాజకీయ నాయకులకు రాజకీయంగా, సినీ యాక్టర్లకు సినిమా తరహాలో ప్రశ్నలు సందించి సంచలనం సృష్టించారు షర్మిల. ఇలా ఆమె ప్రజలకు చేరువయ్యారు.జగన్ జైలుకెళ్లినా…… వైసీపీ పార్టీకి పెద్ద దిక్కుగా షర్మిల ముందుకు సాగారు. ఎన్నికల ముందు, తర్వాత ఓ వైపు తల్లి విజయలక్ష్మి, మరోవైపు సోదరి షర్మిల విస్త్రత ప్రచారంతో జనంలోకి వెళ్లిపోయారు. సమస్యలపై బాణాలు సందిస్తూ కార్యకర్తలను, నాయకులను ఆకట్టుకున్నారు. ఇలా ఎంతో కష్టపడ్డ షర్మిల, ఆమె తల్లి విజయలక్ష్మిలకు జగనన్న ప్రభుత్వంలో సముచిత స్థానం లభిస్తుందని ప్రచారం జరిగింది. కాని షర్మిల ఏనాడూ ఏ పదవి ఆశించలేదు. కేవలం అన్న ముఖ్యమంత్రి కావాలి రాజన్న రాజ్యం రావాలన్నదే ఆమె సంకల్పంగా ఉండేది. అనుకున్నట్లే జగనన్నను సీఎం కుర్చీ ఎక్కించారు. కాని ఆమె మాత్రం పక్కకు తప్పుకున్నారు.. ఎంతో మంది నాయకులు, కార్యకర్తలు జగనన్న ప్రభుత్వం వస్తే షర్మిలమ్మ కు కీలక పదవి దక్కుతుందని భావించారు. కానీ కుటుంబ సభ్యులను జగన్ పదవులకు దూరంగా ఉంచారు. షర్మిలను ఇప్పుడు పార్టీ నేతగాచేయాలన్న డిమాండ్ వైసీపీలో వినపడుతుంది. వచ్చే పార్టీ ప్లీనరీ నాటికి షర్మిలకు పార్టీలో కీలక పదవి దక్కే అవకాశముందన్నది పార్టీ ఇన్నర్ సర్కిల్ లో విన్పిస్తున్న టాక్.