భారీ వర్షం తో తడిసి ముద్దైన తెలంగాణ రాష్ట్రం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

భారీ వర్షం తో తడిసి ముద్దైన తెలంగాణ రాష్ట్రం

హైదరాబాద్ సెప్టెంబర్ 25 (way2newstv.com)
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఎడతెరిపిలేకుండా వానలు పడుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు నాలుగు జిల్లాల్లో భారీవర్షం కురిసింది. మరో ఎనిమిది జిల్లాల్లో ఓ మోస్తరువానపడింది. మంచిర్యాల జిల్లా కన్నెపల్లిలో అత్యధికంగా 13.02 సెంటీమీటర్లు, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో 12 సెం.మీ. వర్షపాతం నమోదైంది. మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల నిజామాబాద్, సిద్దిపేట, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీవర్షం కురిసింది. వరంగల్, మహబూబ్‌నగర్, నల్లగొండ, వికారాబాద్, మెదక్, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల జిల్లాలో ఓమోస్తరు వానపడింది. రాష్ట్రం లోని పలు జిల్లాల్లో సాయంత్రం ఐదు గంటలకు మొదలైన వాన.. రాత్రి తొమ్మిది గంటలవరకు ఏకధాటిగా కురిసింది. సిరిసిల్ల జిల్లాలో పిడుగుపాటుకు ఒకరు మృత్యువాతపడ్డారు. 
 భారీ వర్షం తో తడిసి ముద్దైన తెలంగాణ రాష్ట్రం

ఆదిలాబాద్ జిల్లా జైనథ్‌లో సాయంత్రం పనులు ముగించుకొని ఎండ్లబండిపై ఇంటికి వెళ్తూ వాగులో చిక్కుకున్న కుటుంబాన్ని స్థానికులు రక్షించారు. పలుచోట్ల లోతట్టు ప్రాంతాలుజలమయమయ్యాయి. పలు జిల్లాల్లో చెరువులు మత్తడి దుంకుతున్నాయి.గ్రేటర్ హైదరాబాద్‌లో మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు కుండపోత వాన కురిసింది. ఏకధాటిగా కురిసినభారీవర్షానికి భాగ్యనగరం తడిసిముద్దయింది. సగటున ఎనిమిది నుంచి తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. అత్యధికంగా తిరుమలగిరిలోరికార్డుస్థాయిలో 12.1 సెం.మీ. వర్షపాతం నమోదైంది. సికింద్రాబాద్, పంజాగుట్ట, బంజారాహిల్స్, సికింద్రాబాద్- ఉప్పల్, రామంతాపూర్- చాదర్‌ఘాట్, జూబ్లీహిల్స్, హైటెక్‌సిటీ తదితర ప్రధానరోడ్లపైనీరు నిలువడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మాదాపూర్ అయ్యప్ప సొసైటీ, నీరూస్ జంక్షన్, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్-45లోని నెక్టర్ గార్డెన్స్ తదితర ప్రాంతాల్లో రోడ్లు ముంపునకుగురయ్యాయి. గచ్చిబౌలి, హైటెక్‌సిటీ, పంజాగుట్ట, మూసాపేట్ దీన్‌దయాళ్‌నగర్, ఈస్ట్ ఆనంద్‌బాద్‌లోని షిర్డీనగర్, బాలానగర్ మెయిన్‌రోడ్‌లోని నర్సాపూర్ క్రాస్‌రోడ్స్, ఎంజే మార్కెట్, అఫ్జల్‌గంజ్ఫ్రూట్‌మార్కెట్, అల్వాల్ రాజీవ్‌నగర్‌కాలనీ, తార్నాక క్రాస్‌రోడ్స్, ఆలుగడ్డబావి ఒలిఫెంటా బ్రిడ్జి, సికింద్రాబాద్ కర్బలా మైదాన్ తదితర ప్రాంతాల్లో రోడ్లపై మోకాళ్లలోతు నీరు నిలిచిపోయింది.జీహెచ్‌ఎంసీకి చెందిన మాన్సూన్ రెస్పాన్స్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. సహాయ చర్యలను నగర మేయర్ బొంతు రామ్మోహన కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షించారు. తక్షణమేసహాయ చర్యలు చేపట్టిన సిబ్బందిని అభినందించారు.దంచికొట్టిన వాన: శాంతినగర్, చిలుకానగర్‌లో 12 సెం.మీ., వెస్ట్‌మారేడ్‌పల్లిలో 11.4 సెం.మీ., రామంతాపూర్ ఎస్సార్టీ పార్కు, ఉస్మానియా వర్శిటీలో 11.4 సెం.మీ., మల్కాజిగిరిలో 11.1సెం మీ., దీన్‌దయాళ్‌నగర్, అడ్డగుట్టలో 11 సెం.మీ., మెట్టుగూడ 10.9 సెం.మీ., ముషీరాబాద్ 10.6 సెం.మీ., బేగంపేట 10.4 సెం.మీ., మోండామార్కెట్ 10.3 సెం.మీ., హబ్సిగూడ10.2 సెం.మీ., ఓల్డ్ బోయిన్‌పల్లి 10.0 సెం.మీ., ఏఎస్‌రావునగర్ 9.9 సెం.మీ., దమ్మాయిగూడ 9.8 సెం.మీ., ఉప్పల్ 9.7 సెం.మీ., మల్కాజిగిరి మధుసూదన్‌నగర్ 9.5 సెం. మీ.,ప్రశాంత్‌నగర్, కవాడిగూడ, 9.2 సెం. మీ., ఇందిరానగర్, మారుతీనగర్ 9.0 సెం. మీ., కాప్రా 8.9 సెం.మీ., జూబ్లీహిల్స్ ఎంసీహెచ్‌ఆర్డీ 8.8 సెం.మీ., పాటిగడ్డ 8.6 సెం. మీ., ఖైరతాబాద్8.5 సెం.మీ., అంబర్‌పేట 8.5 సెం.మీ., నాంపల్లి 8.4 సెం.మీ., బంజారాహిల్స్ 8.4 సెం.మీ., ఎల్బీనగర్ 8.3 సెం. మీ., రామంతాపూర్ వార్డు ఆఫీస్ 8.2 సెం. మీ., మల్లాపూర్బయోడైవర్సిటీ 8.0 సెం. మీ., పద్మారావునగర్ 7.7 సెం.మీ., మాదాపూర్‌లో 7.5 సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది.భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల జిల్లాల్లో 2 సెం.మీ.భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సగటున 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పాల్వంచ, దుమ్ముగూడెం, అన్నపురెడ్డిపల్లి, చండ్రుగొండ, చుంచుపల్లి, బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు, సుజాతనగర్,లక్ష్మీదేవిపల్లి, జూలూరుపాడు మండలాల్లో వానపడింది. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. మంచిర్యాల జిల్లాలో రెండు సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయింది. సాయంత్రం ప్రారంభమైనవర్షం.. రాత్రి ఎనిమిదిన్నరదాకా కొనసాగింది. భీమినిలో 6.88, బెల్లంపల్లిలో 5.16, తాండూరులో 5.20, కాసిపేటలో 3.69 సెం.మీ. వర్షపాతం నమోదయింది. జన్నారం, దండేపల్లి, లక్సెట్టిపేట, ాజీపూర్, కన్నెపల్లి, వేమనపల్లి, నెన్నెల, మందమర్రి, మంచిర్యాల, నస్పూర్, జైపూర్, భీమారం, చెన్నూర్, కోటపల్లి మండలాల్లో చిరు జల్లులు పడ్డాయి.మహబూబాబాద్ లో భారీ వర్షం కురిసింది.నర్సింహులపేట మండలంలో గంటపాటు వర్షం కురవడంతో చెరువులు, కుంటల్లోకి భారీగా వరదనీరు చేరింది. నల్లగొండ జిల్లా కేంద్రంతోపాటు జిల్లాలోనిపలుప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. కట్టంగూరు, నాంపల్లి, డిండి, శాలిగౌరారం మండలాల్లో మోస్తరు వాన పడింది. వారంరోజులుగా కురుస్తున్న వర్షాలకు పలు చెరువులు అలుగుపోస్తున్నాయి మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంతోపాటు దేవరకద్ర, జడ్చర్ల నియోజకవర్గాల్లోని పలుప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. వారంరోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆరుతడి పంటలు కళకళలాడుతున్నాయి. వికారాబాద్ జిల్లాలోని పలుమండలాల్లో వర్షంపడింది. తాండూరు, పరిగి, వికారాబాద్, కొడంగల్ నియోజకవర్గాల్లోని పలు మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది. తాండూరు,యాలాల, బషీరాబాద్, పెద్దేముల్ మండలాల్లో భారీవర్షం కురువడంతో గాజీపూర్, బుద్ధారం వాగులు పొంగిపొర్లుతున్నాయి. తాండూరుకు వెళ్లే రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.సిద్దిపేట, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిలాల్లో..సిద్దిపేట జిల్లాలో సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి పలుచెరువులు, కుంటల్లోకి నీరు చేరింది. జిల్లావ్యాప్తంగా సరాసరి 1.74 సెం.మీ., అత్యధికంగా జగదేవ్‌పూర్ మండలంలో7.47 సెం.మీ. వర్షపాతం నమోదైంది. మెదక్ జిల్లాలో ఓ మోస్తరు వాన పడింది. మనోహరాబాద్‌లో 4.39 సెం.మీ., తూప్రాన్ 3.47, వెల్దుర్తి 1.52, రామాయంపేట 1.44, కొల్చారంమండలాల్లో 1.05 సెం.మీ. వర్షపాతం నమోదైంది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మూడురోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో మళ్లీ వాగులు ఉప్పొంగుతున్నాయి. జిల్లాలో మంగళవారంరెండు సెంటీమీటర్ల సరాసరి వర్షపాతం నమోదైంది. జిల్లాలో అత్యధికంగా జైనూర్‌లో 5.16 సెం.మీ. వర్షపాతం రికార్డయింది.ఎద్దులబండితో సహ వృద్ధ్ద దంపతులు రక్షించిన గ్రామస్తులుఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని కూర గ్రామానికి చెందిన అగ్గు భూమన్న, అగ్గు లక్ష్మిదంపతులు సాయంత్రం పని ముగించుకొని ఎండ్లబండిపై వాగు దాటుతుండగా ఒక్కసారిగా వరద ఉధృతిపెరిగింది. బండితో సహా వృద్ధ్ద దంపతులు వరద ఉధృతికి కొట్టుకపోతున్న తరుణంలో ఓ చిన్నారి గమనించి గ్రామస్థులకు సమాచారం చేరవేసింది. హుటాహుటిన గ్రామస్థులు వాగువద్దకు చేరుకొనిఎడ్లబండి సహా దంపతులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.