ఆటో డ్రైవర్ల నమోదు వేగవంతం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఆటో డ్రైవర్ల నమోదు వేగవంతం

ఏలూరు, సెప్టెంబర్ 25(way2newstv.com)
పశ్చిమగోదావరిజిల్లాలో కారు, క్యాబ్, ఆటోడ్రైవర్లకు ప్రభుత్వం ఉచితంగా అందించే 10 వేల రూపాయల పధకం విజయవంతం చేయడానికి రవాణాశాఖ అధికారులు ఆన్ లైన్ నమోధు కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్  రేవు ముత్యలరాజు ఆదేశించారు. స్థానిక జడ్పి కార్యాలయంలో బుధవారం గ్రామసచివాలయ ఉద్యోగాల నియామక ఏర్పాట్లపై జరిగిన సభలో పాల్గొన్న క లెక్టర్ఒ సెల్ ఫోన్ ద్వారా ఆటోడ్రైవర్లతో 10 వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమ ఏర్పాట్లపై రవాణాశాఖ అధికారులకు ఫోన్ చేసి డేటా సమాచారం తెలుసుకున్నారు.
ఆటో డ్రైవర్ల నమోదు వేగవంతం

జిల్లా వ్యాప్తంగా 45 వేల మంది ఈపధకం క్రింద లబ్దిపొందడానికి అవకాశం ఉండగా ఇప్పటివరకు 12864 మంది మాత్రమే తమ పేర్లను ఆన్ లైన్ లో చేయించుకున్న దృష్ట్యా డ్రైవర్లలో చైతన్యం తీసుకువచ్చి వెంటనే ఆన్ లైన్ లో సమగ్ర సమాచారం పొందుపర్చేలా రవాణాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆన్ లైన్ లో తనవద్దకు వచ్చిన 8796 మంచి ఆటోడ్రైవర్లకు పరిపాలనా మంజూరు ఇచ్చామని ప్రభుత్వం డ్రైవర్లను ఆదుకోవాలనే బృహత్తర సంకల్పంతో చేపట్టిన ఈ పధకం క్రింద ఆన్ లైన్ ధరఖాస్తులను నమోదుచేసి సమగ్ర డేటాతో సిద్దంగా ఉండాలని కలెక్టర్ఒ ఆదేశించారు. డిటిఒ  శ్రీధర్  మాట్లాడుతూ ఆటోడ్రైవర్ల సమగ్ర సమాచారాన్ని ఎప్పటికప్పుడు జిల్లా వ్యాప్తంగా సేకరిస్తున్నామని ఈ రాత్రికి పూర్తిస్థాయి నివేదిక సిద్దం చేస్తామని చెప్పారు.