విజయవాడ, సెప్టెంబర్ 5 (way2newstv.com)
ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు ఏపీఐఐసీ ఛైర్మన్, ఎమ్మెల్యే రోజా. కుటుంబంతో కలిసి ఆమె ఈ టూర్‌కు వెళ్లారు. పర్యటనలో భాగంగా.. ఆస్ట్రేలియా ఇండియన్ హై కమిషనర్ Dr.A.M.గొండనేతో రోజా సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు అవకాశాల గురించి చర్చించారు. ఈ సందర్భంగా రోజా ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న వివిధ అభివృద్ది పథకాల గురించి హై కమిషనర్‌కి వివరించగా..
ఆసీస్ టూర్ లో రోజా
ఆయన జగన్ గారి ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు.పర్యటనలో మొదటి రోజు సిడ్నీలో.. NSW ఆధ్వర్యంలో జరిగిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్థంతి కార్యక్రమంలో భర్త సెల్వమణితో కలిసి పాల్గొన్నారు. వైఎస్‌కు ఎమ్మెల్యే రోజా ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఎన్‌ఐఆర్‌లు రోజా దంపతుల్ని సత్కరించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన పాలనతో ఇప్పటికీ తెలుగువారి గుండెల్లో ఉన్నారన్నారు రోజా. జగన్ కూడా తండ్రి బాటలో ఏపీ ప్రజలకు సంక్షేమ పాలనను అందిస్తున్నారని కితాబిచ్చారు.
Tags:
Andrapradeshnews