అరకొరగా చెత్త తయారీ కేంద్రాలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అరకొరగా చెత్త తయారీ కేంద్రాలు

శ్రీకాకుళం, సెప్టెంబర్ 18, (way2newstv.com)
కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్‌ మిషన్‌ ఆధ్వర్యంలో గ్రామాల్లో పారిశుధ్యాన్ని మెరుగు పరిచి, వాటి ద్వారా వచ్చే ఆదాయంతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను ప్రారంభించింది. ఇందులో భాగంగా మండలానికి 30 వరకూ కేంద్రాలను నిర్మించేందుకు ప్రతిపాదించి, నిర్మాణాలు కూడా ప్రారంభించారు. ఇందులో సుమారు 18 వరకూ నిర్మాణాలు పూర్తి చేసుకుని, ఎవురువల విక్రయాలు కూడా ప్రారంభించేశారు. కొన్ని గ్రామాల్లో నిర్మాణాలు నిలిచిపోగా, ఇంకోన్ని గ్రామాల్లో పూర్తిగా ప్రారంభానికి కూడా నోచుకోలేదు. దీంతో ఆయా గ్రామాల్లో పారిశుధ్య సమస్య తలెత్తుతుంది. మారేడుపూడి, గోపాలరావు, గొలగాం, కొండుపాలెం, మాకవరం, మామిడిపాలెం, సుందరయ్యపేట, పాపయ్య సంతపాలెం గ్రామాల్లో మధ్యలోనే నిలచిపోయాయి. 
అరకొరగా చెత్త తయారీ కేంద్రాలు

ఇక రొంగలివానిపాలెం, రేబాక గ్రామాల్లో స్థల సమస్య వల్ల ఇప్పటికీ ప్రారంభించ లేదు. రూ.2వేల లోపు జనాభా ఉన్న గ్రామంలో రూ.3లక్షలతో 12 కాలమ్స్‌ షెడ్డు, 2నుంచి 5వేలు జనాభా ఉంటే రూ.నాలుగున్నర లక్షలతో 18కాలమ్స్‌, 5 నుంచి 9వేలు జనాభా ఉంటే సుమారు రూ.8లక్షలతో 30 కాలమ్స్‌, 9వేలు పైబడ్డ జనాభా ఉన్న గ్రామాల్లో సుమారు రూ.10లక్షలతో 35 కాలమ్స్‌తో షెడ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంది.బవులవాడ, మార్టూరు, సంపతిపురం, పిసినికాడ, గ్రామాలతో పాటు మొత్తం 18 యూనిట్లు పూర్తి అయినట్టు మండల అభివృద్ది అధికారి పి ఉమామహేశ్వరరావు తెలిపారు. వీటిలో కేవలం బవులవాడలో మాత్రమే చెత్త నుండి సంపద కొద్దిమేర ఉత్పత్తి చేయగలిగారు. కిలో రూ.10 నుంచి రూ.12 పెట్టడడంతో కొనుగోలుకు అంతగా ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో నాలుగు గ్రామాల్లో తయారవుతున్న చెత్త నుంచి సంపద కేంద్రాల్లో చెత్త పేరుకుపోయినట్టు ఆయన చెప్పారు. దీనిపై గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తామని త్వరలోనే అన్ని గ్రామాల్లో చెత్త నుంచి సంపద కేంద్రాలను పూర్తి చేసి ఉత్పత్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. తుమ్మపాల మేజర్‌ పంచాయితీలో షెడ్ల నిర్మాణం మాత్రమే జరిగింది. యంత్ర సామగ్రి పంచాయితీ కార్యాలయంలోనే మూలుగుతోంది. స్వచ్ఛ భారత మిషన్‌లో భాగంగా మూడేళ్ల కిందట మంజూరైన రెండు ట్రాక్టర్లు, సుమారు 25 రిక్షాలు నిరుపయోగంగా ఉండిపోయాయి. ఇదిలా ఉండగా ఇందులో పని చేసేందుకు ప్రతి వెయ్యి మంది జనాభాకు గ్రీన్‌ అంబాసిడర్‌ను ప్రభుత్వం నియమించింది. వీరికి నెలకు రూ.6వేల జీతం ఇవ్వడానికి కూడా ప్రతిపాదించింది. అయితే కేంద్రాలు ప్రారంభించి, వాటిని నిర్వహణకూడా మొదలు పెట్టేశారు. సుమారు ఆరు నెలల నుంచి వీరికి ఇంత వరకు ఒక నెల జీతం కూడా ప్రభుత్వం నుంచి మంజూరు కాకపోవడంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెత్త నుంచి సంపద కేంద్రం నిధులు మంజూరైనా గ్రామంలో పారిశుధ్య సమస్య అలాగే మిగిలిపోవడం పట్ల గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే వీటిని పూర్తి చేయాలని మండలంలోని ఆయా గ్రామస్తులు కోరుతున్నారు.