కాళేశ్వరం తో తెలంగాణ సస్య శ్యామలం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కాళేశ్వరం తో తెలంగాణ సస్య శ్యామలం

మంత్రి  అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
గొప్ప పుణ్యక్షేత్రంగా వేములవాడ
500 కోట్లతో అభివృద్ధి పనులు
గోదావరి జలాలతో జిల్లా సస్యశ్యామలం
నియోజకవర్గంలో పేదలకు  800  డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం
సిరిసిల్ల, సెప్టెంబర్ 5  (way2newstv.com)
కాళేశ్వరం ప్రాజెక్ట్ తో రాష్ట్రంలోని 14 జిల్లాలు సస్య శ్యామలం కానున్నాయని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి  అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు .  సాగునీటి సమస్యల తో పాటు త్రాగునీటి సమస్యలకుకాళేశ్వరం ప్రాజెక్ట్ శాశ్వత పరిష్కారం చూపనుందని తెలిపారు . ఉమ్మడి రాష్ట్రం , స్వరాష్ట్రం లో పరిస్టితులు బేరీజు వేసుకుంటే క్షేత్రస్థాయిలో జరిగిన అభివృద్ధి మన కళ్ళముందే కనిపిస్తుందన్నారు .రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి జరగనుందని మంత్రి తెలిపారు . గురువారం వేములవాడ సంకెపెల్లి శివారులో లో రూ .17 కోట్ల 10 లక్షలతో చేపట్టిన శ్రీ రాజేశ్వర ( మధ్య మానేరు ) జలాశయంఫోర్ షేర్ నుండి గుడి చెరువు కు గోదావరి జలాలను తీసుకువచ్చే  ఎత్తిపోతల పథకం కు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి  అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, స్థానికశాసన సభ్యులు  చెన్నమనేని రమేష్ బాబు , జిల్లా కలెక్టర్  కృష్ణ  భాస్కర్  తో కలిసి ప్రారంభోత్సవం చేసారు . అనంతరం వేములవాడ గుడి చెరువు వద్ద గోదావరి జలాలకు ప్రత్యేక పూజలునిర్వహించారు  
కాళేశ్వరం తో తెలంగాణ సస్య శ్యామలం

.ఈ సందర్భంగా గుడి చెరువు వద్ద స్థానిక శాసన సభ్యులు  చెన్నమనేని రమేష్ బాబు అధ్యక్షతన ఏర్పాటు చేసిన  కార్యక్రమంలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు . గుడిచెరువు ఎత్తిపోతల పథకంతో  వేములవాడ  పవిత్ర పుణ్యక్షేత్రం ధర్మ గుడం 365 రోజులు గోదావరి జలాలతో నిండు గా ఉంటుందన్నారు సామాన్యుల కొంగు బంగారంగా .... రాష్ట్రంలోనే అధిక భక్తులు వచ్చే దేవాలయం గావేములవాడ శ్రీ  రాజ రాజేశ్వర స్వామి వారికీ ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు . మహారాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు రాజన్న దర్శనం కు వస్తారన్నారు .అలాంటి సుప్రసిద్ధ శ్రీ  రాజ రాజేశ్వర స్వామిఆలయం ను  అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు .రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ చొరవతో వేములవాడ పుణ్యక్షేత్రం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని పేర్కొన్నారు . గుడి చెరువు కోసం 30 ఎకరాల స్థలం ను రైతుల నుంచి సేకరించి గుడి చెరువు నునిర్మించుకున్నామని అన్నారు. దేవతల అనుగ్రహంతో గుడి చెరువు లోకి గోదావరి జలాలను ఎత్తిపోసుకునే కార్యక్రమం విజయవంతం అయ్యిందన్నారు . నాలుగు  వందల కోట్ల రూపాయలతో ఆలయ అభివృద్ధి పనులు సాగుతున్నాయని మంత్రి అన్నారు. స్థానిక శాసన సభ్యులు వేములవాడ ఆలయం తో పాటు నియోజవర్గ అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్నారని మంత్రి ప్రసంశించారు . రానున్నరోజుల్లో భక్తులకు సకల సౌకర్యాలతో  వేములవాడ పట్టణం గొప్ప పుణ్యక్షేత్రంగా శ్రీ రాజ రాజేశ్వర స్వామి ఆలయం  విలసిల్లుతుందని అన్నారు. మేడిగడ్డ ,అన్నారం ,సుందిళ్ళ బ్యారేజి లతో తెలంగాణప్రాంతం సస్యశ్యామలం అవుతుందని అన్నారు . అంతేకాకుండా రైతుబందు ,కళ్యాణ లక్షి , షాదీ ముబారక్ , ఆసరా పెన్షన్ లు వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతుందనితెలిపారు .స్థానిక శాసన సభ్యులు  చెన్నమనేని రమేష్ బాబు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా  వేములవాడ నియోజకవర్గంలో ఒక లక్ష ఎకరాలకు సాగు నీరు అందిస్తామన్నారు . మిడ్‌ మానేరు నుంచి17.50 కోట్ల వ్యయంతో నిర్మిం చిన ఎత్తిపోతల పథకం ద్వారా ఇకపై గుడి చెరువులో 365 రోజుల నీళ్లు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు.. పట్టణ త్రాగునీటి అవసరాలుతీరుతాయన్నారు . 400 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులు చేపదుతున్నామని దశల వారిగా పనులను క్రమపద్దతిలో పూర్తీ చేస్తామన్నారు . 272 కోట్లతో వేములవాడ చుట్టూరా పరిసరాలనుఅభివృద్ధి చేస్తున్నామన్నారు . భక్తుల సౌకర్యార్థం 31 ప్లాట్ ఫాం లతో 20 కోట్ల అంచనా వ్యయంతో నూతన బస్సు స్టాండ్ ను నిర్మిస్తామన్నారు . నియోజకవర్గంలో 800 డబుల్‌ బెడ్‌రూంఇళ్లనిర్మాణం మహిళల పేరుతొ కట్టనున్నామని శాసన సభ్యలు తెలిపారు . త్వరలో నిర్మాణంలో ఉన్న 100 పడకల ఆసుపత్రిని ప్రారంభిస్తామని తెలిపారు . ఒక్క పైసా ఖర్చు లేకుండా నియోజకవర్గపేద ప్రజలకు సూపర్ స్పెషాలి టి వైద్య సేవలు అందుతాయన్నారు. రానున్న రోజుల్లో నియోజవర్గం ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని శ్రీ చెన్నమనేని రమేష్ బాబుకార్యక్రమంలో  జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ , జిల్లా కలెక్టర్‌  కృష్ణభాస్కర్‌, ఆర్డీవో   శ్రీనివాసరావు, ఇ రి గేషన్ ఈ ఈ  అమరేందర్ ,  ఈఈ  అశోక్ , తహసిల్దార్ శ్రీనివాస్  స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు .