రైల్వే జోన్ ఏర్పాటు దిశగా అడుగులు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రైల్వే జోన్ ఏర్పాటు దిశగా అడుగులు

విశాఖపట్టణం, సెప్టెంబర్ 13, (way2newstv.com)
విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్‌ ఏర్పాటు చర్యలు ముమ్మరమయ్యాయి. అందులో భాగంగా వాల్తేరు డివిజన్‌ను విభజించి ఒక భాగాన్ని కొత్తగా ఏర్పాటవుతున్న రాయగడ డివిజన్‌లో, మరో భాగాన్నివిజయవాడ డివిజన్‌లో కలిపేందుకు ఇప్పటికే మ్యాపింగ్‌ సిద్ధమవుతోంది. మరోవైపు దక్షిణ కోస్తా జోన్‌ ఏర్పాటుకు సంబంధించిన డీపీఆర్‌ను రెండు నెలల్లో సిద్ధం చేసేందుకు అధికారులు కృషిచేస్తున్నారు. కొత్త జోన్‌లో సుమారు 50 వేల మంది ఉద్యోగులు ఉండే అవకాశం ఉందని రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు. వాల్తేర్‌ డివిజన్‌ విభజనపై వ్యతిరేకత వెల్లువెత్తుతున్న నేపథ్యంలోదానిపై కొంత సందిగ్ధత ఉన్నప్పటికీ.. కొత్త జోన్‌కు అడ్డంకులు లేకపోవడంతో రైల్వే బోర్డు సన్నాహాలతో ముందుకెళ్తోంది.కొత్త జోన్‌ను ఏదో నామమాత్రంగా కాకుండా పక్కాగానే ప్రారంభించాలనిఅధికారులు భావిస్తున్నారు. 
రైల్వే జోన్ ఏర్పాటు దిశగా అడుగులు

ఆ దిశగా ప్రతిపాదనలు చేస్తున్నారు. సాధారణంగా జోన్‌ ఏర్పాటు సమయంలో 30 వేల నుంచి 40 వేల మంది ఉద్యోగులు మాత్రమే ఉండేవారు. క్రమంగా ఆ సంఖ్యనుపెంచడం ఆనవాయితీ. కానీ దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ మాత్రం 50 వేల మంది ఉద్యోగులతో కార్యకలాపాలు ప్రారంభించనుంది. ప్రస్తుతం వాల్తేరు డివిజన్‌ కార్యాలయంలో 17,755 మంది ఉద్యోగులువిధులు నిర్వర్తిస్తున్నారు. వాల్తేర్‌ డీఆర్‌ఎం కార్యాలయంలో 900 మంది ఉద్యోగులున్నారు. ఈ డివిజన్‌ను విడదీస్తున్నందున వీరిని రెండు డివిజన్లకు సర్దుబాటు చేస్తున్నారు. విజయవాడ,గుంతకల్లు, గుంటూరు డివిజన్లు సౌత్‌ కోస్ట్‌ జోన్‌ పరిధిలోకి వస్తున్నాయి. ఈ మూడు డివిజన్లు కలిపి మొత్తం 50 వేల ఉద్యోగులు ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.కొత్త జోన్‌ఏర్పాటుకు సంబంధించి డీటెయిల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్టు(డీపీఆర్‌) తయారీలో ఓఎస్‌డీతో పాటు ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే జోన్‌ అధికారులు తలమునకలయ్యారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు కర్ణాటక,తమిళనాడు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలు కొత్త జోన్‌లో చేరుతున్నాయి. జోన్‌ స్వరూపం ఎలా ఉండాలి.. డివిజన్లతో సమన్వయం ఎలా కుదుర్చుకోవాలి.. జోన్‌ పరిధిలోకి వచ్చే రైల్వే స్టేషన్లు, ఉద్యోగులవిభజన, పని విభజన, తదితర అంశాలతో నివేదిక సిద్ధం చేస్తున్నారు. అదేవిధంగా వివిధ కేటగిరీల రైల్వే స్టేషన్లు, వాటిని కొత్త జోన్‌లో అభివృద్ధి చేసేందుకు ఉన్న వనరులు, జోన్‌ కేంద్రంగా కొత్తగానడపాల్సిన రైళ్ల ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటి వరకు 30 శాతం వివరాలు సేకరించామని.. మిగతా వివరాల సేకరించి.. డీపీఆర్‌ నివేదిక తయారీకి మరో రెండు నెలల సమయంపడుతుందని అధికారులు చెబుతున్నారు. మిగిలిన జోన్లతో పోలిస్తే.. విశాఖ కేంద్రంగా ఏర్పాటవుతున్న సౌత్‌ కోస్ట్‌ జోన్‌ పటిష్టంగా ఉండబోతోందని వారు స్పష్టం చేస్తున్నారు. ఈ జోన్‌ వార్షికాదాయంరూ.20 వేల కోట్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని వారు పేర్కొన్నారు.