మోడల్‌ స్కూళ్లకు మహర్దశ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మోడల్‌ స్కూళ్లకు మహర్దశ

గుంటూరు, సెప్టెంబర్ 13, (way2newstv.com)
మోడల్‌ స్కూళ్లకు మహర్దశ పట్టనుంది. పాఠశాల విద్యతో సంబంధం లేకుండా ప్రత్యేక సొసైటీ ద్వారా నిర్వహిస్తూ వచ్చిన మోడల్‌ స్కూళ్లను విద్యాశాఖలో విలీనం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.ఈ మేరకు పాఠశాల విద్యాశాఖకు మార్గదర్శకాలు జారీ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఆంగ్ల మాధ్యమంలో నాణ్యమైన విద్యను అందిచాలనే ఆశయంతో మహానేత వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగాఉన్న సమయంలో చేసిన కార్యాచరణకు రూపాంతరంగా వీటిని 2013లో రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించారు. 6వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్‌ వరకూ విద్యాబోధన అందించేందుకు ఉద్దేశించినమోడల్‌ స్కూళ్లు మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాయి. విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి స్పందన లభించడంతో పాటు ప్రతి ఏటా సీట్లను భర్తీ చేయడంలో డిమాండ్‌ నెలకొంటోంది. 
మోడల్‌ స్కూళ్లకు మహర్దశ

రాష్ట్రంలోని 13జిల్లాల వారీగా 165 మోడల్‌ స్కూళ్లు ఉండగా, జిల్లాలో 14 ఉన్నాయి. ప్రతి పాఠశాలలో ప్రిన్సిపాల్‌తో పాటు 13 మంది పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌ (పీజీటీ), ఆరుగురు ట్రైనీ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌(టీజీటీ) పోస్టులు ఉన్నాయి. ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా 2,113 రెగ్యులర్‌ ఉద్యోగులు ఉండగా, అదనంగా మంజూరు చేసిన 990 పోస్టుల్ని ప్రభుత్వం డీఎస్సీ–2018 ద్వారా భర్తీ చేయనుంది.  జిల్లావ్యాప్తంగా ఉన్న 14 మోడల్‌ స్కూళ్లకు గానూ పూర్తిస్థాయిలో సీట్లు భర్తీ అవుతున్నాయి. ఈ విధంగా ఒక్కో పాఠశాలలో 6వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్‌ వరకూ 700 మంది చొప్పునవిద్యార్థులు చదువుతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థినులకు హాస్టల్‌ సదుపాయాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది.మోడల్‌ స్కూళ్లలో పనిచేస్తున్న ఉద్యోగులపై  ప్రభుత్వం పూర్తిగా వివక్షచూపింది. రెగ్యులర్‌ ప్రాతిపదికన నియమించిన ప్రభుత్వ ఉద్యోగులే అయినప్పటికీ ఉద్యోగోన్నతులు, సాధారణ బదిలీలు వర్తింప చేయలేదు. కారుణ్య నియామకాలు, హెల్త్‌కార్డులతో పాటు మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ వంటి సదుపాయాలు వీరికి లేవు. దీంతో పాటు ఐఆర్‌ సైతం అమలుకు నోచుకోలేదు. విద్యాశాఖలో ఉద్యోగులుగా ఉన్నప్పటికీ వేతనం మినహా ఇతర ఎటువంటి ప్రయోజనాలులేకుండా కాలం వెళ్లదీస్తున్న మోడల్‌ స్కూళ్ల టీచర్లు, తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గత టీడీపీ ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా పట్టించుకున్న పరిస్థితులు లేవు. రాష్ట్రస్థాయిలోఆందోళనలు చేసినా గత ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా మొద్దు నిద్ర పోయింది.