హైదరాబాద్, సెప్టెంబర్ 6, (way2newstv.com)
హుస్సేన్ సాగర్లో వినాయక నిమజ్జనానికి సంబంధించి ఏర్పాట్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం ఉదయం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మేయర్ బోంతు రామ్ మోహన్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ ఇతర అధికారులు పాల్గోన్నారు.
నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి తలసాని
మంత్రి మాట్లాడుతూ నిమజ్జనానికి అన్ని శాఖలను సమన్వయపరుస్తూ ముందుకెళుతున్నామని చెప్పారు. పారిశుద్ధ్యానికిసంబంధించి అన్ని చర్యలు తీసుకున్నామని ఆయన చెప్పారు. ఖైరతాబాద్ వినాయకుడిని తొందరగా నిమజ్జనం చేయాలని ఒత్తిడి చేయబోమని ఆయన చెప్పారు. హుస్సేన్ సాగర్లో 20 ఫీట్ల లోతువరకూ తవ్వకాలు జరిపామని ఆయన వెల్లడించారు.
Tags:
telangananews