మహబూబ్ నగర్ సెప్టెంబర్ 04 (way2newstv.com)
తెలంగాణ ఏర్పడిందే నీళ్ల కోసం. దానికి అనుగుణంగానే వచ్చిన తెలంగాణలో కేసీఆర్ గారు నీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చి అమలు చేస్తున్నారు. దేశంలో అత్యధిక చెరువులు, కుంటలు ఉన్న రాష్ట్రం తెలంగాణ . మిషన్ కాకతీయ పేరుతో తెలంగాణ రాష్ట్రం ఎప్పుడో జలశక్తి అభియాన్ మొదలుపెట్టింది .. ఈ కార్యక్రమం మొదలుపెట్టిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. బుధవారం . మహబూబ్ నగర్ జిల్లా హన్వాడలో జరిగిన కిసాన్ మేళాలో అయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, , జడ్పీ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి ఇతరులు పాల్గోన్నారు. మంత్రి మాట్లాడుతూ పెండింగ్ ప్రాజెక్టులతో మిషన్ కాకతీయ కింద బాగయిన చెరువులను నింపడం, పంటలు పండించుకోవడం జరుగుతుంది.
తెలంగాణ ఏర్పడిందే నీళ్ల కోసం
ఐదేళ్ల తరువాత ఇప్పుడు కేంద్రం ఈ పథకాన్ని తీసుకుందని అన్నారు. ఆంధ్రకు నీళ్ల కోసం తెలంగాణ చిన్న నీటి వనరులను సమైక్య పాలకులు ధ్వంసం చేశారు. ఆంధ్రాలో పోలవరం నిర్మాణానికి నిధులిచ్చి కట్టిస్తున్న కేంద్రం తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా ఇవ్వడం లేదు. అన్నం పెట్టే రైతు చేయి చాచే స్థితిలో ఉండొద్దన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అని అన్న్నారు. అందుకే ప్రాజెక్టులు, ఉచిత కరంటు , రైతుబంధు, రైతుభీమా పథకాలతో వ్యవసాయానికి అండగా నిలిచారు. ప్రతి ఎకరానికి సాగునీరు తీసుకొస్తాం. తెలంగాణ రైతుకు ఎవరూ పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు. జాలొడ్లు పండిన తెలంగాణ నేలలో మళ్లీ నీళ్లు జాలువారాలన్నదే తెలంగాణ ప్రభుత్వ ఆకాంక్ష. భూగోళంలో ఒక వంతు భూమి, మూడొంతులు సముద్రం ఉంది ఆ నీళ్లు మనకు అక్కరకు రావని అన్నారు. వర్షాలు, హిమాలయాల నుండి వచ్చే నీళ్లు .. ఇవి మాత్రమే జీవకోటికి ఉపయోగపడతాయి . వాడుకుంటూ పోతే అన్నీ అయిపోతాయి. అందుకే తెలంగాణ ప్రభుత్వం జల సంరక్షణ చర్యలు చేపట్టింది. జలశక్తి అభియాన్ కింద కేంద్రం ఇప్పుడు మొదలుపెట్టింది. ఈ పనిని ఐదేళ్ల క్రితమే తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. ప్రతి నీటిబొట్టును సద్వినియోగం చేసుకోవాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని అన్నారు. కేంద్రం అనుకున్న లక్ష్యానికన్నా తెలంగాణ రాష్ట్రం జలసంరక్షణలో ముందుంటుందని మంత్రి అన్నారు.
Tags:
telangananews