బతుకమ్మ చీరల పంపిణీలో సింహభాగం హైదరాబాద్ దే –మేయర్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

బతుకమ్మ చీరల పంపిణీలో సింహభాగం హైదరాబాద్ దే –మేయర్

హైదరాబాద్ సెప్టెంబర్ 24 (way2newstv.com)    
ఆడపడుచులను బతుకమ్మ పండుగ సందర్భంగా చీరలు అందించి గౌరవించేందుకు గాను ప్రభుత్వం బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టిందని నగర మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు.మంగళవారం మల్లాపూర్ లోని వి.ఎన్.ఆర్ గార్డెన్ లో ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, ఎం.బి.సి ఛైర్మన్ తాడూరి శ్రీనివాస్ లతో కలిసి మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈసందర్బంగా మేయర్ రామ్మోహన్ మాట్లాడుతూ...దసరా కానుకగా ప్రభుత్వం ఆడుపడుచులందరికీ అందిస్తున్న బతుకమ్మ చీరల్లో గ్రేటర్ హైదరాబాద్ లోనే పదిహేనున్నర లక్షల చీరలను పంపిణీచేస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి ఏటా ఇచ్చినట్లే ఈ సారి కూడా దసరా కానుకగా బతుకమ్మ చీరలను అందజేస్తున్నామని తెలిపారు. వందకు పైగా డిజైన్లలో నాణ్యమైన చీరలను సుమారు రూ.300కోట్లకు పైగా వెచ్చించి రూపొందించామని తెలిపారు. 
బతుకమ్మ చీరల పంపిణీలో సింహభాగం హైదరాబాద్ దే –మేయర్

కేవలం ఉప్పల్ నియోజకవర్గంలోనే లక్ష మంది మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీ చేస్తున్నామని అన్నారు. గొప్ప సంస్కృతిక వారసత్వ చరిత్రతెలంగాణాకు ఉందని, ప్రత్యేక రాష్ట్రం సిద్దించిన అనంతరమే బతుకమ్మ పండుగకు ప్రపంచ వ్యాప్త గుర్తింపు లభించిందని గుర్తుచేశారు. గ్లోబలైజేషన్ ప్రభావంతో రాష్ట్రంలోని కుల వృత్తుల మనుగడప్రమాదంలో పడిందని, ఈ నేపథ్యంలో నేత కార్మికులను ఆదుకునేందుకుగాను రాష్ట్ర ముఖ్య మంత్రి కెసిఆర్ బతుకమ్మ చీరల ద్వారా ఉపాధి కల్పించారని పేర్కొన్నారు. ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి మాట్లాడుతూ సమాజంలోని ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలన్నదే రాష్ట్ర ముఖ్య మంత్రి కె.సి.ఆర్ ఆశయమని అన్నారు. దీనిలో భాగంగానే సమాజంలో సగభాగమైన మహిళలందరూ దసరాకానుకగా బతుకమ్మ చీరలను పంపిణీ చేసినట్టు పేర్కొన్నారు. పింఛన్లు, రైతు బందు, కల్యాణ లక్ష్మి, మిషన్ భగీరథ తదిరత విప్లవాత్మక పథకాలను అమలుచేసే ఏకైక ప్రభుత్వం మనదని ఎమ్మెల్యేతెలిపారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ ఎస్.శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేటర్లు పన్నాల దేవేందర్ రెడ్డి, గొల్లూరి అంజయ్య, పావనిరెడ్డి, శాంతి శేఖర్, డిప్యూటి కమిషనర్ థశరత్ తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి హాజరైన మహిళలు బతుకమ్మ ఆటలతో సభను హుషారెత్తించారు.