వైద్య ఆరోగ్యశాఖలో పీపీపీ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

వైద్య ఆరోగ్యశాఖలో పీపీపీ

గుంటూరు, సెప్టెంబర్ 14, (way2newstv.com)
వైద్య, ఆరోగ్య శాఖలో పలు సంస్కరణలకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది.ప్రస్తుతం ఆరోగ్య శాఖలో పీపీపీ విధానంలో ముఖ్యమంత్రి ఐ కేంద్రాలు, ముఖ్యమంత్రి బాల సురక్ష, ఆసుపత్రిలో వైద్యపరికరాల నిర్వహణ(టీపీఎస్), పీహెచ్‌సీల్లో వైద్య పరీక్షల నిర్వహణ సంస్థ(మెడాల్), కిడ్నీ రోగులకు ఉచితంగా అందించే డయాలసిస్ చేసేందుకు నెఫ్రోఫ్లస్ వంటి సేవలను పీపీపీ విధానంలో అమలుచేస్తున్నారు. వీటిన్నింటినీ దశలవారీగా నిలిపివేసి ప్రభుత్వమే వాటిని నిర్వహించాలని భావిస్తోంది. కమిటీ నివేదికను పూర్తిస్థాయిలో ప్రభుత్వానికి అందించిన తరువాత తక్షణమే పీపీపీ ప్రాజెక్టులనునిలిపివేయనున్నారు. దీనిలో భాగంగా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పీపీపీ పద్ధతిలో అమలు చేసిన పలు ఆరోగ్య శాఖ పథకాలను వైసీపీ ప్రభుత్వం తిరిగి కొనసాగించే విషయంలో పునరాలోచనలోపడింది.
గులాబీలో ముళ్లు

ఆరోగ్య సంస్కరణలు చేపట్టేందుకు విశ్రాంత ఐఏఎస్ అధికారి సుజాతరావు నేతృత్వంలో నియమించిన అధ్యయన కమిటీ ప్రస్తుతం ఆరోగ్య శాఖలో అమలు చేస్తున్న పలు రకాల వైద్య పథకాలపనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే పీపీపీ పద్ధతిలో కొనసాగుతున్న పలు ఆరోగ్య పథకాలను ఒక్కసారిగా రద్దు చేస్తే రోగులకుఅందించే సేవల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొంటుందని భావించిన ఉన్నతాధికారులు దశల వారీగా పథకాలను నిలిపివేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిఅధికారిక ఉత్తర్వులు రావల్సి ఉందని వాటి ప్రకారమే చర్యలు తీసుకుంటామని రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారి  తెలిపారు. వాటిస్థానే ప్రభుత్వమే నేరుగా రోగులకు వైద్యసేవల అందించే విషయాన్ని కూడాకమిటీ పరిశీలన చేస్తుంది. అదే సమయంలో ఆయా సేవలను అందిస్తున్నందుకు ప్రాజెక్టు నిర్వహకులకు భారీ మొత్తాన్ని సదరు సంస్థలకు ప్రభుత్వం చెల్లిస్తోంది. ఏటా ఆయా సంస్థలకు చెల్లించేనిధుల ద్వారా ప్రభుత్వమే మెరుగైన వైద్యసేవలను అందించేందుకు అవకాశం ఉందని, దీని కారణంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోని వౌలిక వసతులు, వైద్య పరికరాల సదుపాయాలు మెరుగుపడతాయనిసూజాతరావు కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందించినట్లు సమాచారం. కమిటీ సూచన మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య శాఖ ద్వారా ఏ ఏ పథకాలు పీపీపీ పద్ధతిలో అమలువుతున్నాయనే వివరాలనుసమగ్రంగా పరిశీలిస్తున్నారు.రాష్టవ్య్రాప్తంగా అన్ని పీహెచ్‌సీల్లో రోగులకు అందించే వైద్య సేవల్లో భాగంగా రక్త పరీక్షలు, స్కానింగ్ పరీక్షలు చేసేలా మెడాల్ సంస్థకు నిర్వహణ బాధ్యతలను అప్పగించారు.అయితే ఆయా సంస్థకు గత ఎనిమిది నెలలుగా ఇవ్వాల్సిన బకాయిలను ప్రభుత్వం చెల్లించని నేపథ్యంలో ఆయా సంస్థలు చేతి డబ్బులు పెట్టి మెడాల్ సంస్థను నిర్వహణ చేపట్టలేమంటూప్రభుత్వానికి హెచ్చరించింది. ఇదే సమయంలో మెడాల్ సంస్థ నుంచి 13 జిల్లాల్లో పలు ఏజెన్సీలు ఫ్రాంచైజీలు తీసుకున్నాయి. ఆయా ఏజెన్సీల నిర్వహకులు సైతం వారి దగ్గర పనిచేస్తున్నసిబ్బందికి గత మూడు నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో వారు కూడా విధులకు హాజరయ్యేందుకు శ్రద్ధ చూపడం లేదు. అయితే వాస్తవానికి రాష్ట్రంలోని మెడాల్ సంస్థకు ముందస్తు ఒప్పందంప్రకారం డిసెంబర్ 2020 వరకూ నిర్వహణ బాధ్యతలు చేపట్టే అనుమతి ఉంది. కేవలం మెడాల్ సంస్థకు చెల్లించాల్సిన బకాయిల నేపథ్యంలోనే సేవలు నిలిచిపోతున్నాయి. మరో విశేషం ఏమిటంటేఅసలే రాష్టవ్య్రాప్తంగా ఏడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా విశాఖ, శ్రీకాకుళం, విజయవాడ, అనంతపురం జిల్లాలో డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా, విష జ్వరాలతో ఆసుపత్రిలన్నీరోగులతో నిండిపోతున్నాయి. ఇదే సమయంలో వైద్య పరీక్షలు నిర్వహించే వారు లేని కారణంగా రోగులంతా ప్రైవేట్ ల్యాబ్‌లను ఆశ్రయించాల్సి వస్తోంది. ఈ విషయంపై ప్రభుత్వం తక్షణమే స్పందించిపెండింగ్ బకాయిలు చెల్లించి ప్రస్తుత నిర్వహణ సంస్థ ద్వారానే పరీక్షలు చేపట్టాలంటూ పలువురు డిమాండ్ చేస్తున్నారు.