ఎలక్ట్రిక్ బస్సులకు టెండర్లు

నెల్లూరు, సెప్టెంబర్ 14, (way2newstv.com)
రాష్ట్రవ్యాప్తంగా 2024నాటికి ప్రస్తుతం ఉన్న బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్‌ బస్సులు నడపాలనే ధ్యేయంలో భాగంగా కేంద్రం నుంచి తొలి విడతగా రాష్ట్రానికి మంజూరైన 350 బస్సులకు బుధవారంఆన్‌లైన్‌ ద్వారా టెండర్లను ఆహ్వానిస్తున్నారు. దీనిలో ప్రయివేటు కంపెనీ తయారీదారులు పాల్గొంటారు. ఒక్కో ఎలక్ట్రికల్‌ బస్సు విలువ సుమారు రూ.2.8 కోట్లు ఉంటుందని అంచనా. మోటార్‌రంగంలో దేశంలో పేరెన్నికగన్న అశోక్‌ లేలాండ్‌ కంపెనీతోపాటు పలు అంతర్జాతీయ స్థాయి బస్సుల తయారీ కంపెనీలు కూడా ఈ టెండర్ల ప్రక్రియలో పాల్గొనే అవకాశం ఉందని ఆర్టీసీ అధికారులుచెబుతున్నారు. బహిరంగ వేలంలో కిలోమీటర్‌కు ఏ కంపెనీ అయితే ఆర్టీసీ నిర్దేశించిన రేట్లకనుగుణంగా కోడ్‌ చేస్తుందో ఆ కంపెనీ కాంట్రాక్ట్‌ను చేజిక్కించుకునే అవకాశం ఉంటుంది. 
ఎలక్ట్రిక్  బస్సులకు టెండర్లు

సర్వీసునుఉపయోగించుకున్నందుకు కిలోమీటర్‌ ఒక్కింటికి రూ.60 ఉండే అవకాశం ఉందని తెలిసింది. బస్సు డ్రైవర్‌ దగ్గర నుంచి దాని నిర్వహణ, షెడ్‌ ఏర్పాటు ఇవ్వన్నీ బస్సులు ఇచ్చే కంపెనీలే భరించాల్సిఉంటుంది. అయితే ఈ స్థాయి రేట్ల ప్రకారం ఎలక్ట్రికల్‌ సర్వీసులను ఆహ్వానిస్తే ప్రయివేటు కంపెనీలకు ఆర్టీసీ సొమ్మును దోచిపెట్టడమే అవుతుందని కార్మికులు, ఉద్యోగులు, ఆర్‌టిసి యూనియన్ల వారుఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఫాస్ట్‌ అడాప్షన్‌ మొఫైల్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్‌ (ఫేమ్‌-2) స్కీమ్‌ కింద తొలి దశలో 350 బస్సులు రాష్ట్రానికి మంజూరయ్యాయి. మరో విడతలో 650 బస్సులను కేంద్రంమంజూరు చేస్తుందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఫేమ్‌-1 కింద గతంలో రాష్ట్రానికి మంజూరైన ఎలక్ట్రికల్‌ సర్వీసులు అప్పట్లోనే రద్దయినట్లు తెలిసింది. ప్రస్తుతం ఫేమ్‌-2 కింద మంజూరైన350 సర్వీసులకు టెండర్లను పిలిచారు.రాష్ట్రానికి మంజూరైన 350 సర్వీసులను విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ, గుంటూరు నగరాల్లో నడుపుతారు. విజయవాడ నగరంలో ఈవిడతలో 150 బస్సులను ప్రవేశపెడతారు. మలి విడతలో మరో 200 సర్వీసులు నడిపే అవకాశం ఉంటుందని ఆర్‌టిసి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు (ఇడిలు) చెబుతున్నారు. ఒక్కో బస్సులో ఎసితోపాటు43 సీట్లు ఉంటాయి. ఒకసారి ఛార్జింగ్‌ పెడితే 250 కిలోమీటర్ల వరకూ ప్రయాణించొచ్చని అధికారులు చెబుతున్నారు.
Previous Post Next Post