ఉపాధ్యయులందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఉపాధ్యయులందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు

విలువలతో కూడిన సమాజానికి ఉపాధ్యాయులు పునాదులు వేయాలి
పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ
అమరావతి, సెప్టెంబర్ 04  (way2newstv.com)
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని ఉపాధ్యయులందరికీ పురపాలక శాఖ మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో ఉపాధ్యాయ వర్గానికి ఆది నుంచీ పెద్దపీట ఉందని, భావి తరాన్ని తీర్చిదిద్దే ప్రక్రియలో వీరందరూ గురుతరబాధ్యతలు నిర్వహిస్తున్నారని ఉపాధ్యాయుల సేవలను కొనియాడారు. ఉత్తమమైన వ్యక్తులుగా విద్యార్ధులను మలిచే ఉపాధ్యాయులందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియచేశారు. 
 ఉపాధ్యయులందరికీ  టీచర్స్ డే శుభాకాంక్షలు

విలువలతో కూడిన సమాజమే లక్ష్యంగా, ప్రస్తతమున్న పరిస్థితుల్లో మార్పులు రావాలన్న గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆశయాలకు ఆనుగుణంగా ఉపాధ్యాయులందరూ తమ విధులను నిర్వహించాలని ఆయన అన్నారు. విద్యార్ధుల్లో ఉన్నత విలువలు పెంపొందిస్తూ, వారి భవిష్యత్తుకు మంచి పునాదులు వేసేలా పురపాలక శాఖ పాఠశాలల్లోనూ, ఇతర విద్యా సంస్థల్లోనూ విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులందరూ కృషి చేయాలని  ఈ సందర్భంగా మంత్రి  ఆకాంక్షించారు.