హైద్రాబాద్, సెప్టెంబర్ 25 (way2newstv.com)
ముఖ కమెడియన్ వేణు మాధవ్ కొద్ది సేపటి క్రితం కన్నుమూశారు. సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్న ఆయనకు కిడ్నీ సమస్యలు కూడా రావడంతో కుటుంబ సభ్యులు ఇటీవలే ఆస్పత్రిలో చేర్పించారు. వేణుమాధవ్‌కు వైద్యులు వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కొద్ది సేపటి క్రితం ఆయన మరణించారు. ఆయన ఆత్మకి శాంతి కలగాలని ప్రముఖులు ప్రార్ధించారు. 1979 డిసెంబర్ 30న తెలంగాణలోని కోదాడలో జన్మించారు. పువ్వుపుట్టగానే పరిమళిస్తుందన్నట్టుగానే తన నాల్గో ఏట నుంచే మిమిక్రీ చేయడం ప్రారంభించాడు.
కమెడియన్ వేణు కన్నుమూత
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో వేణు మాధవ్ పండించే హాస్యం కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. అదే ఆయన్ని హాస్యనటుల్లో ప్రత్యేకంగా నిలిచేలా చేసింది. ముఖ్యంగా తెలంగాణ యాసలో వేణు మాధవ్ పండించే హాస్యానికి ఫిదా కానీ అభిమానులుండరు.టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వేణుమాధవ్ గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు. గతంలో ఆయనకు ఆరోగ్యం బాగోలేదంటూ వార్తలు వచ్చాయి. అంతేకాదు ఆయన చనిపోయినట్టు కూడా పుకార్లు షికార్లు చేసాయి. ఐతే వేణుమాధవ్ మాత్రం వాటన్నింటినీ ఖండిస్తూ వచ్చాడు. కానీ తాజాగా కిడ్నీకి సంబంధిత వ్యాధితో బాధపడుతూ కన్నుమూయడం టాలీవుడ్‌కు తీరని లోటు అని చెప్పొచ్చు. ఆయనకు ఇద్దరు పిల్లలున్నారు.గెటప్ శ్రీనుపై మెగాబ్రదర్ నాగబాబు జబర్దస్త్ ప్రశంసలు..గెటప్ శ్రీనుపై మెగాబ్రదర్ నాగబాబు జబర్దస్త్ ప్రశంసలు..గద్దలకొండను ప్రశంసలతో ముంచెత్తిన మెగాస్టార్ చిరంజీవి..గద్దలకొండను ప్రశంసలతో ముంచెత్తిన మెగాస్టార్ చిరంజీవి..‘సైరా’ తర్వాత మరో పవర్ఫుల్ ప్రాజెక్ట్‌లో తమన్నా..‘సైరా’ తర్వాత మరో పవర్ఫుల్ ప్రాజెక్ట్‌లో తమన్నా..హరీష్ శంకర్‌కు దిమ్మదిరిగే ఆన్సర్ ఇచ్చిన విజయ్ దేవరకొండ..హరీష్ శంకర్‌కు దిమ్మదిరిగే ఆన్సర్ ఇచ్చిన విజయ్ దేవరకొండ..చిరంజీవితో భేటి అయిన ఉయ్యాలవాడ వారసులు..చిరంజీవితో భేటి అయిన ఉయ్యాలవాడ వారసులు..ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సంప్రదాయం’ సినిమాతో తెరంగేట్రం చేయకముందే.. అన్న ఎన్టీఆర్‌గారు స్థాపించిన తెలుగు దేశం పార్టీ ఆఫీసులో ఆఫీస్ బాయ్‌గా పనిచేసాడు. అలా అన్న ఎన్టీఆర్‌గారికి దగ్గరయ్యారు. ముందుగా మిమిక్రీ ఆర్టిస్ట్‌గా పనిచేస్తూనే సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు కొనసాగించాడు. ఆ తర్వాత ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కించిన ‘సంప్రదాయం’తో కమెడియన్‌గా వెనుదిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘తొలిప్రేమ’ మంచి బ్రేక్ ఇచ్చింది.ఆ తర్వాత ‘యువకుడు’, ‘దిల్’, ‘లక్ష్మి’, ‘సై’, ‘ఛత్రపతి’ ‘మాస్’ చిత్రాలు కమెడియన్‌గా మంచిపేరు తీసుకొచ్చాయి. 2006లో వెంకటేష్ హీరోగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకుెక్కిన ‘లక్ష్మి’ సినిమాకు గాను ఉత్తమ హాస్యనటుడిగా వేణుమాదవ్ నంది పురస్కారాన్ని అందుకున్నారు.ఇక తనను నటుడిగా పరిచయం చేసిన ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘హంగామా’ సినిమాతో హీరో అయ్యాడు. ఆ తర్వాత ‘భూకైలాస్’, ‘ప్రేమాభిషేకం’ వంటి పలు సినిమాల్లో హీరోగా నటించాడు. మొత్తంగా 300పైగా చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించాడు.
Tags:
telangananews