కేవీపీ సైలెంట్ ఎందుకు అయ్యారు... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కేవీపీ సైలెంట్ ఎందుకు అయ్యారు...

విజయవాడ, సెప్టెంబర్ 27, (way2newstv.com)
కేవీపీ రామచంద్రరావు… ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కరలేని పేరు. 2019 ఎన్నికలకు ముందు కేవీపీ రామచంద్రరావు యాక్టివ్ గా ఉండేవారు.కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడిగా ఆయన ఏపీ రాజకీయాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టేవారు. అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం ఉండటంతో ఆయన ప్రభుత్వంపై విరుచుకుపడేవారు. లేఖలను సంధించేవారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబునాయుడుకు వంద ప్రశ్నలు సంధించారు కేవీపీ రామచంద్రరావు. అయితే 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం కొలువుదీరింది. ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు విషయంలో కేవీపీ నిత్యం వార్తల్లో నిలిచేవారు. పోలవరం ప్రాజెక్టుకు పాదయాత్ర కూడా చేసిన కేవీపీ రామచంద్రరావు పోలవరం ప్రాజెక్టు విషయంలో న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. 
కేవీపీ సైలెంట్ ఎందుకు అయ్యారు...

చంద్రబాబు తెలంగాణలో కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకున్నా, పార్టీ అధినేత రాహుల్ గాంధీతో సమావేశాలు అవుతున్నా కేవీపీ రామచంద్రరావు మాత్రం చంద్రబాబుపై విమర్శల దాడిని తగ్గించలేదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన పోలవరం ప్రాజెక్టు ను చంద్రబాబు తన కలల ప్రాజెక్టుగా చెప్పుకోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసేవారు.అయితే ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వచ్చింది. పోలవరం ప్రాజెక్టుపై రోజుకో రగడ జరుగుతుంది. పోలవరం పనులు నిలిచిపోయాయ. రివర్స్ టెండరింగ్ కు జగన్ ప్రభుత్వం వెళ్లింది. ప్రభుత్వానికి ప్రజాధనం ఆదా చేయడం కోసమే తాము రివర్స్ టెండరింగ్ వెళ్లామని జగన్ సర్కార్ చెబుతోంది. అయితే ఇంత జరుగుతున్నా కేవీపీ రామచంద్రరావు మాత్రం పెదవి విప్పడం లేదు. మూడు నెలలుగా జగన్ పాలనపై ఆయన తన అభిప్రాయాలను కూడా వ్యక్తం చేయలేదు. కేవీపీ రామచంద్రరావు సైలెన్స్ వెనక కారణాలేంటి? అన్న చర్చ జరుగుతోంది.ఒక్క పోలవరం ప్రాజెక్టు మాత్రమే కాదు ఏపీలో కాంగ్రెస్ కార్యక్రమాల్లో కూడా కేవీపీ రామచంద్రరావు పెద్దగా పాల్గొనడం లేదు. కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నా ఆయన దానికి దూరమయినట్లే కన్పిస్తుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మగా పేరున్న కేవీపీ రామచంద్రరావు పోలవరం ప్రాజెక్టు విషయంలో స్పందించకపోవడంపై చర్చ జరుగుతోంది. కేవీపీ ఇంతకీ ఏపీ రాజకీయాల్లోకి మళ్లీ వస్తారా? వైఎస్ హయాంలో చక్రం తిప్పిన కేవీపీ ఇప్పుడు ఆయన తనయుడు జగన్ ముఖ్యమంత్రి కావడంతో పరోక్షంగా సలహాలు ఇస్తున్నారా? అన్నది కూడా చర్చనీయాంశమైంది. మొత్తం మీద కేవీపీ రామచంద్రరావు జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెదవి విప్పకుండా పదవి కోసం చూస్తున్నారా? అన్నది పార్టీలో హాట్ టాపిక్ గా మారింది.