శ్రీవాణికి జగన్ క్లాస్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

శ్రీవాణికి జగన్ క్లాస్

విజయనగరం, సెప్టెంబర్ 27 (way2newstv.com)
వైసీపీ సర్కార్ లో అతి పిన్న వయస్కురాలు ఎవరంటే విజయనగరం జిల్లా కురుపాం ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి పేరు చెప్పుకోవాలి. ఆమె కేవలం 31 ఏళ్లకే ఉప ముఖ్యమంత్రి హోదాను సంపాదించారు. గెలిచింది రెండు మార్లు అయినా కూడా పుష్ప శ్రీవాణి ఏపీ రాజకీయాల్లో కీలకమైన పదవిలో కుదురుకున్నారు. మంత్రి కావడం అన్నది చాలా మందికి జీవిత కాలం కల. అటువంటిది పుష్ప శ్రీవాణి రెండవ మారు ఎమ్మెల్యే కాగానే మంత్రి అవడం అంటే అది అదృష్టంగా కూడా చెప్పుకోవాలి. జగన్ ఆమె మీద ఉంచిన నమ్మకానికి నిదర్శంగా కూడా చూడాలి. ఇక మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కురుపాం వంశంలో దిగ్గజం లాంటి నాయకుడు నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితం అతనిది. 
శ్రీవాణికి జగన్ క్లాస్

అతను వారసుడిగా తమ్ముడు మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖరరాజు గానీ, మేనల్లుడు జనార్ధన్ థాట్రాజ్ కానీ నిలబడలేకపోయారు. బయట నుంచి వచ్చిన కోడలు పిల్ల పుష్ప శ్రీవాణి మాత్రం మామని ఎదిరించి మరీ రాజకీయాల్లో గట్టిగానే నిలదొక్కుకుంది. ఓ విధంగా మామను గెలిచిన కోడలుగా కూడా చెప్పుకోవాలిపుష్ప శ్రీవాణి డిప్యూటీ సీఎం హోదా నుంచి ఇపుడు కొత్త పాత్రలోకి మారారు. ఆమె టీచర్ గా ముఖ్య పాత్రలో అమృత‌భూమి పేరు మీద సినిమా రూపొందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఆమె సొంత నియోజకవర్గం కురుపాంలోని లోవముఠా ప్రాంతంలో జరిగింది. ప్రకృతి వైద్యాన్ని ప్రోత్సహించేలా ఈ సినిమా సందేశం ఇస్తుంది. కీలకమైన పాత్ర కావడం, సందేశం ఉండడంతో ఈ సినిమాలో నటించినట్లుగా డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి పేర్కొంటున్నారు. ఇక మరో విశేషం ఏంటంటే పూర్వాశ్రమంలో పుష్ప శ్రీవాణి టీచర్ గా కొంత కాలం పెళ్ళికి ముందు పనిచేశారు. అంటే ఓ విధంగా అమె నిజ జీవితంలోని పాత్రను పోషిస్తున్నారన్నమాట. ఇంకో విశేషం ఏంటంటే ఈ సినిమాలో విజయనగరం జిల్లా కలెక్టర్ హరి జవహర్ బాధ్యత కలిగిన అధికారిగా కనిపిస్తున్నారు.పనిచేయాలని ఆసక్తి ఉంది, తగిన ప్రతిభ కూడా ఉంది. జగన్ లాంటి వారి అండదండలు ఉన్నాయి. అటువంటిది పుష్ప శ్రీవాణి ఎమ్మెల్యేగా మంచి మార్కులు తెచ్చుకున్నారు. డిప్యూటీ సీఎంగా మాత్రం ఎందుకో వెనకబడ్డారన్న పేరు తెచ్చుకున్నారు. ఆమెను వెనకన ఉంచి భర్త పరీక్షిత్ రాజు హవా చలాయిస్తున్నారన్న ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నారు. ఈ మహిళా మంత్రి మాత్రం చూసీ చూడనట్లుగా ఊరుకోవడం వల్ల రాజకీయంగా భారీ నష్టాన్ని కోరి తెచ్చుకుంటున్నారని అంటున్నారు. విద్యావంతురాలిగా, డేరింగ్ నేచర్ కలిగి ఉన్న పుష్ప శ్రీవాణి కనుక తనకు తానుగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగితే ఆమె కొన్ని దశాబ్దాల పాటు ఎదురులేని రాజకీయాన్ని చలాయిస్తారని అంటున్నారు. గతంలో ఇదే జిల్లాలో టీడీపీ నుంచి పడాల అరుణ మంత్రిగా పనిచేశారు. మళ్ళీ ఇపుడు డిప్యూటీ సీఎం హోదాలో శ్రీవాణికి అవకాశం దక్కింది. మరి జగన్ తరచూ జాగ్రత్తలూ చెబుతున్నారు, హెచ్చరిస్తున్నారు. దారి మార్చుకుని సత్తా చాటితే పుష్ప శ్రీవాణి కురుపాం వంశానికే తిరుగులేని వారసురాలు అవుతారని అంటున్నారు. చూడాలి మరి.