చంద్రగిరి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మహా సంప్రోక్షణ
తిరుపతి అక్టోబర్ 22 (way2newstv.com)
టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని చంద్రగిరి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో అక్టోబరు 23 నుండి 25వ తేదీ వరకు బాలాలయ జీర్ణోద్ధరణ, మహా సంప్రోక్షణ కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అక్టోబరు 23వ తేదీ సాయంత్రం వాస్తుపూజ, విష్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, అంకురార్పణంతో బాలాలయ జీర్ణోద్ధరణ ప్రారంభంకానుంది.
అక్టోబరు 23 నుండి 25వ తేదీ వరకు
ఇందులో భాగంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అక్టోబరు 24వ తేదీ ఉ9దయం 7.30 నుండి 11.00 గంటల వరకు కలపకర్షణ, చతుష్టార్చన, శయ్యాధివాసం, జలధివాసం, సాయంత్రం 5.00 గంటలకు శయ్యాధి కర్మాంగ స్నపనం నిర్వహిస్తారు. అక్టోబరు 25వ తేదీ ఉదయం 8.00 నుండి 10.30 గంటల వరకు ద్వారా పూజ, మహా శాంతి హోమం, మహా శాంతి అభిషేకం, పూర్ణాహుతి, మహా సంప్రోక్షణ నిర్వహిస్తారు.