ఇవాళ్టి నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఇవాళ్టి నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్

హైద్రాబాద్, జనవరి 31, (way2newstv.com)
తెలంగాణలో ప్రాక్టికల్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.  1 నుంచి 21వ తేదీ వరకు జరిగే ప్రాక్టికల్‌ పరీక్షల కోసం ఇంటర్‌ బోర్డు సర్వంసిద్ధం చేసింది. ప్రభుత్వ, ఎయిడెడ్‌, గురుకులాలు, ప్రయివేటు జూనియర్‌ కాలేజీల్లో 4,33,480 మంది విద్యార్థులు హాజరవుతారని తెలిపారు. ఇందులో ఎంపీసీ-2,36,364 మంది, బైపీసీ-1,21,745 మంది, జాగ్రఫీ-422 మంది, ఒకేషనల్‌ ప్రథమ సంవత్సరం-40,365 మంది, ద్వితీయ సంవత్సరం- 34,584 మంది చొప్పున 3,33,480 మంది హాజరు కావాల్సి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 1,632 కేంద్రాల్లో ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో జనరల్‌లో 1,468, ఒకేషనల్‌లో 164 కేంద్రాలున్నాయని పేర్కొన్నారు. ప్రాక్టికల్‌ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. 
ఇవాళ్టి నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్

వసతులు, అనుభవమున్న జూనియర్‌ కాలేజీలను ప్రాక్టికల్స్‌ నిర్వహణకు కేంద్రాలుగా ఎంపిక చేశారు. 6,410 ఎగ్జామినర్లను గుర్తించామని తెలిపారు. ప్రయివేటు జూనియర్‌ కాలేజీల్లోని ప్రాక్టికల్‌ కేంద్రంలో డిపార్ట్‌మెంటల్‌ అధికారి పరిశీలకునిగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. ప్రాక్టికల్స్‌ను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌లను నియమించామని, ఉన్నతస్థాయి కమిటీని, జిల్లా పరీక్షల కమిటీలు పర్యవేక్షిస్తాయని తెలిపారు. ఇంటర్‌ బోర్డు నుంచి రాష్ట్రస్థాయి పరిశీలకులుగా అధికారులు జిల్లాలకు వెళ్లి ప్రాక్టికల్స్‌ను పరిశీలిస్తారని పేర్కొన్నారు. గతేడాది నుంచి ప్రాక్టికల్‌ పరీక్షల కోసం ఆన్‌లైన్‌లో ప్రశ్నాపత్రాన్ని డౌన్‌లోడ్‌ చేసుకునే విధానాన్ని ప్రవేశపెట్టామని తెలిపారు. ప్రాక్టికల్‌ ప్రారంభానికి అరగంట ముందు ఎగ్జామినర్లకు వన్‌టైం పాస్‌వర్డ్‌ వస్తుందని, దాని ఆధారంగా ప్రశ్నాపత్రం డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుందని సూచించారు. పరీక్ష పూర్తయిన తర్వాత అదేరోజు విద్యార్థుల మార్కులను, జవాబు పత్రాలను ఇంటర్‌ బోర్డు వెబ్‌సైట్‌లో పొందుపరచాలని తెలిపారు. ఆన్‌లైన్‌ ప్రశ్నాపత్రం డౌన్‌లోడ్‌ విధానంపై ఎగ్జామినర్లకు జిల్లా స్థాయిలో ఇంటర్‌ బోర్డు అవగాహన కలిగించిందని పేర్కొన్నారు. విద్యార్థుల హాల్‌టికెట్లు సంబంధిత కాలేజీలకు ఇప్పటికే పంపించామని తెలిపారు