ఏపీ సచివాలయంలో మరో 25 వేల ఉద్యోగాలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఏపీ సచివాలయంలో మరో 25 వేల ఉద్యోగాలు

విజయవాడ, అక్టోబరు 15, (way2newstv.com)
విఏపీలో అక్టోబరు 2 నుంచి గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆయా సచివాలయాల్లోని మొత్తం 1.26 లక్షల ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న 21 లక్షల మంది అభ్యర్థులకు ప్రభుత్వం సెప్టెంబరులో రాతపరీక్షలు నిర్వహించింది. పరీక్షల్లో అర్హత సాధించి.. తుది జాబితాలకు ఎంపికైన 1.01 లక్షల మంది అభ్యర్థులకు ధ్రవపత్రాల పరిశీలన నిర్వహించి.. వారికి నియామక పత్రాలు కూడా అందజేసింది. అయితే మిగిలిన 25 వేలపైగా పోస్టుల భర్తీకి సంబంధించి అధికారులు కార్యచరణ సిద్ధం చేస్తున్నారు. 
ఏపీ సచివాలయంలో మరో 25 వేల ఉద్యోగాలు

ఈ మేరకు ఖాళీల వివరాలతో ప్రభుత్వానికి త్వరలోనే నివేదిక అందజేయనున్నారు.ఆరు విభాగాల్లో మొత్తం 39,176 పోస్టులకుగానూ 18,217 మంది అభ్యర్థులు మాత్రమే అర్హత సాధించారు. మిగతా 20,959 పోస్టులు ఖాళీగానే మిగిలాయి. అర్హత మార్కులను తగ్గించడం ద్వారా మిగతా ఖాళీలను ప్రభుత్వం భర్తీ చేస్తే.. మరింత మంది అభ్యర్థులు ప్రయోజనం పొందుతారు. వీటితోపాటు మిగతా ఉద్యోగాలకు అర్హత సాధించి నియామకపత్రాలు అందుకోనివారితో కలిపి మొత్తం 25 వేలకు పైగా ఖాళీలు ఏర్పడ్డాయి.
జనవరిలో నోటిఫిషన్?గ్రామ, వార్డు సచివాలయాల్లో మిగిలిపోయిన పోస్టల భర్తీకి సంబంధించి నిరుద్యోగుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎంపిక జాబితాలో అర్హత మార్కులు తగ్గించి మిగతా పోస్టులను భర్తీ చేస్తారా? లేదా మళ్లీ నోటిఫికేషన్ విడుదల చేస్తారా అన్నది ఆసక్తిగా మారింది. ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను ఏటా జనవరిలో భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చెప్పినట్లుగా.. ఈ ఖాళీల భర్తీకి కూడా జనవరిలోనే నోటిఫికేషన్ వెలువడే అవకాశముందని అధికారవర్గాలు అంటున్నాయి.